ఏ దోస్‌తీ మై నహీ ఛోడుంగా....!

‘జనసేన’ అధినేత పవన్‌ కళ్యాణ్‌-ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నేహం బీటలు వారవచ్చని, పూర్తిగా తెగిపోయే అవకాశం కూడా ఉందని రెండు మూడు రోజులుగా ప్రచారమైన ఊహాగానాలకు పవన్‌ తెర దించాడు.ఏపీలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించవద్దని, వారు ఇష్టపడితేనే తీసుకోవాలని పవన్‌ సామాజిక మీడియా ద్వారా సర్కారుకు విజ్ఞప్తి చేశారు.

 Pawan Stating That He Extended Support To Bjp And Tdp-TeluguStop.com

ఏపీలో భూ సేకరణ చట్టాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కూడా స్పష్టంగా చెప్పాడు దీంతో పవన్‌-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించకపోతే భూములు ఎలా సమీకరిస్తామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

పవన్‌ను కొందరు తప్పదోవ పట్టిస్తున్నారని మరో నాయకుడు వ్యాఖ్యానించారు.ప్రభుత్వం భూములు సేకరించాలనుకుంటున్న పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాల్లో పవన్‌ ఆదివారం పర్యటించి తాను భూ సేకరణను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా చెప్పాడు.అయితే ఇదే సందర్భంలో ‘నేను టీడీపీకి, భాజపాకు మద్దతు కొనసాగిస్తాను’ అని బహిరంగ సభలో స్పష్టం చేశారు.సో….టీడీపీ-పవన్‌ స్నేహానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తేలిపోయింది.టీడీపీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం తనకు లేదని చెప్పిన పవర్‌ స్టార్‌ వైకాపా తనకు శత్రువు కాదని చెప్పడం విశేషం.

ఈ వైఖరి టీడీపీకి వ్యతిరేకమైనదే.టీడీపీకి వైకాపా బద్ధ శత్రువు అనే సంగతి తెలిసిందే.

టీడీపీకి మద్దతు కొనసాగిస్తానని చెప్పిన పవన్‌ అదే సందర్భంలో ప్రభుత్వానికి చురకలు కూడా వేశారు.ప్రభుత్వం అనాలోచితంగా భావి తరాలకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.

ప్రస్తుత వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్నారు.తనకు రైతుల సమస్యలు తెలుసునని, తాను వారి తరపునే ఉంటానని అన్నారు.

టీడీపీకి మద్దతు కొనసాగిస్తానని చెప్పిన పవన్‌ రైతలకూ మద్దతు ఇస్తున్నారు.రైతులేమో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారు.

ఇది కొద్దిగా విచిత్రంగానే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube