చెప్పింది చేసిన 'జనసేన' అధినేత

రాజకీయ నాయకుడిగా మారిన ‘జనసేన’ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆ పాత్రను సరిగా పోషించడంలేదని, ‘తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’ అని చెప్పిన ఆయన ఆ పని చేయడంలేదని విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చారు.ఆంధ్రా రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవద్దని, వారి అంగీకారం లేకుండా భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి భూములు గుంజుకోవద్దని పవన్‌ సామాజిక మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Received A Grand Welcome By The Farmers-TeluguStop.com

భూములు ఇవ్వడానికి వ్యతిరేకత చూపుతున్న గ్రామాల్లో తాను పర్యటిస్తానని కూడా తెలిపారు.చెప్పిన ప్రకారమే ఆదివారం గుంటూరు జిల్లాకు వచ్చి పెనుమాక గ్రామంలో పర్యటించారు.

ప్రజలు పవన్‌కు ఘన స్వాగతం పలికారు.పవర్‌ స్టార్‌ వచ్చినందుకు సంబరపడిపోయారు.

ఈ సంబరంలోనే ఒక వ్యక్తి పవన్‌ పైకి రాయి విసిరేశాడు.అయితే పవన్‌ ఈ ఘటనను పట్టించుకోలేదు.

తన వైపు విసిరిన రాయిని చేతబట్టుకొని అక్కడి రైతులతో మాట్లాడారు.పవన్‌ రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఓ వ్యక్తి రాయి విసిరాడు.

అయితే జనసేన అధినేతకు గాయాలేమీ కాలేదు.ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణ పై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

వారి బాధల గాథలను పవన్‌ ఓపికగా విన్నాడు.ఈ సందర్భంగా రైతులపై ఒత్తిడి చేసి భూమి సేకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్‌ వ్యతిరేకించాడు.

తమపై సర్కారు పోలీసు నిర్భంధాలు విధిస్తోందని చెప్పారు.బలవంతంగా భూములు సేకరిస్తే ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడమన్నారు.

భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులకు పవన్‌ రాక ధైర్యాన్ని ఇచ్చింది.తమ తరపున సర్కారును ప్రశ్నించే వ్యక్తి వచ్చాడని సంబరపడ్డారు.

ఇప్పటికే ప్రతిపక్షాలు రైతుల తరపున పోరాడుతున్నప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ వచ్చి తమ బాధలు వినడం వారికి ఊరట కలిగించింది.ఈ రోజు ముఖ్యమంత్రి బాబుతో పవన్‌ భేటీ అవుతాడని ఇదివరకే వార్తలు వచ్చాయి.

భూ సేకరణపై బాబు పవర్‌స్టార్‌ని కన్విన్‌్స చేయొచ్చని కూడా కొందరు చెప్పారు.ఆయన మాట ఈయన వింటాడో, ఈయన మాట ఆయన వింటాడో చెప్పలేం.

ఏది ఏమైనా పవన్‌ ఇప్పటికైనా ప్రశ్నిస్తున్నాడు.ఇది ఆయనలో వచ్చిన మార్పే కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube