గత పది సంవత్సరాల రాజకీయ ప్రయాణం పవన్ కు పూర్తిస్థాయి రాజకీయ అవగాహన పెంచినట్లు కనిపిస్తుంది। ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఒక రాజకీయ పార్టీ అధినేతగా చూపించాల్సిన లౌక్యంతోనే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా తెలుగుదేశంతో పొత్తు ప్రకటన జనసేనలో మెజారిటీ ఫ్యాన్ బేస్ కు నచ్చలేదు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) వ్యవహార శైలి తెలిసిన వారు ఎవరూ కూడా తెలుగుదేశంతో షరతులు లేని పొత్తుకు అంగీకరించారు .అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవని ఈసారి పొత్తు కచ్చితం గా ఇరుపార్టీలకూ లాభం కలిగేలా ఉండాలని అతి జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్టుగా పవన్ వ్యవహార శైలి ఉందని రాజకీయ విశ్లేషకులు( Political analysts ) భావిస్తున్నారు.ముఖ్యంగా చంద్రబాబు, అరెస్టు లోకేష్ కోసం విచారణలను సిద్ధం చేయడం లాంటి పరిణామాలను అతి జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్న పవన్ అధికార వైసీపీని( YCP ) ఓడించాలంటే తన నాయకత్వం తప్పనిసరి అన్న పరిస్థితికి తెలుగు తమ్ముళ్లను ప్రిపేర్ చేస్తున్నట్లుగా ఆయన ప్రసంగాలు ఉన్నాయి.

ముఖ్యంగా పొత్తు లో తాము చాలా నిజాయితీగా ఉన్నామని, తెలుగుదేశం జనసేన ల కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి తాము అత్యంత ప్రాధాన్యతిస్తున్నామన్న సంకేతాలను ఒకపక్క ఇస్తూనే, సంకీర్ణ ప్రభుత్వం అన్న మాట పదేపదే వాడటం ద్వారా పవర్ షేరింగ్లో తమ వాటా కూడా ఉంటుందని, ప్రభుత్వ ఏర్పాటలో జనసేన( Janasena ) భాగస్వామ్యం ఉండాలనే ఒక అల్టిమేటాన్ని తెలుగుదేశానికి ఇస్తున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు, ప్రజలకు ముందు నుంచీ ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అన్న సంకేతాలను ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో టిడిపి వెనకడుగు వేయడానికి అవకాశం లేదు అన్న పరిస్థితిని పవన్ సృష్టిస్తున్నట్టు పవన్ నడుచుకుంటున్నారు .ఎందుకంటే టిడిపి కి ఖండించే ఉద్దేశం ఉంటే ఇప్పుడే ఖండించాలి.తన వారహీ యాత్రలో పూర్తిస్థాయిలో ఈ విషయాలను హైలైట్ చేసిన తర్వాత తెలుగుదేశం వెనకడుగు వేస్తే నమ్మకద్రోహంచేసిననట్టు అవుతుంది, అందువల్ల కచ్చితంగా జనసేన ను అధికారంలో భాగస్వామ్యం చేసే విధంగా పవన్ లౌఖ్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది.







