సిటీల్లో ట్రాఫిక్ సమస్యలు అంతా ఇంతా కాదు.ఈ సమస్యతో బాధపడే ప్రతీ ఒక్కరూ చందమామ కథల్లో లాగా రెక్కల గుర్రం ఉంటే ఎంత బాగుండు అని అనుకునే ఉంటారు.
అయితే వారిందరి కల త్వరలో నిజం కాబోతోంది.రోడ్డుపై నడుస్తూ, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు పక్షిలా ఎగిరిపోయే ఓ కారు అందరికీ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.
వివరాల్లోకి వెళితే, అమెరికాలోని కాలిఫోర్నియా-బేస్డ్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ ( Alef Aeronautics ) ఓ ఫ్లైయింగ్ కారును తయారు చేసింది.అంతేకాదు, ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన ఆటో షోలో దీన్ని చూపించింది.
అలెఫ్ ఏరోనాటిక్స్ ఎగిరే కారు రోడ్లపై నడవగలదు, గాలిలో ఎగరగలదు.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కారు లో స్పీడ్ వెహికల్ ( LSV ) వలె అదే వేగం, ఇతర లిమిటేషన్స్ కలిగి ఉంటుంది.
వేగంగా వెళ్లడానికి, కారును వెర్టికల్ గా టేకాఫ్ చేసి ఫ్లై చేయవచ్చు.కారు ముందుకు, వెనుకకు, కుడి, ఎడమ, పైకి లేదా క్రిందికి ఇలా ఏ దిశలోనైనా ఎగురుతుంది.
ఇది ఒక కోణంలో కూడా ఎగరగలదు.

అలెఫ్ ఏరోనాటిక్స్ ఎగిరే కారు 180 డిగ్రీల కంటే ఎక్కువ వ్యూయింగ్ యాంగిల్ ను అందిస్తుంది, కాబట్టి ప్రయాణీకులు గాల్లో ఎగురుతూనే దృశ్యాలను ఆస్వాదించవచ్చు.కారు పూర్తిగా ఎలక్ట్రిక్, అంటే ఇది ఎలాంటి కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేయదు.ఈ గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్ కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
కంపెనీ భవిష్యత్తులో హైడ్రోజన్-ఆధారిత ఎంపికను అందించాలని యోచిస్తోంది, ఇది లాంగ్ డ్రైవింగ్, ఫ్లయింగ్ రేంజ్ కలిగి ఉంటుంది, అయితే దీని తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది.

అలెఫ్ ఏరోనాటిక్స్ ఫ్లయింగ్ కార్( Aleph Aeronautics Flying Car ) అనేది రెండు-సీట్ల ఎలక్ట్రిక్ వాహనం, ఇది 200 మైళ్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.110 మైళ్ల వరకు ఫ్లైట్ రేంజ్ ఆఫర్ చేస్తుంది.ఇందులో 180 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ కూడా ఉంది.
ఈ కారును ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా 2023, జూన్ నెలలో ఆమోదించింది.దీని ధర దాదాపు రూ.2.46 కోట్లు.అలెఫ్ ఏరోనాటిక్స్ 2022లో కారు కోసం ప్రీ-ఆర్డర్‌లను అంగీకరించడం ప్రారంభించింది.ఇప్పటివరకు 500కి పైగా ఆర్డర్‌లను అందుకుంది.







