బీఆర్ఎస్ ను తిట్టడానికి మొహమాటపడుతున్న పవన్  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి,  జనసేన అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు మొదట్లో కాస్త మొహమాట పడినా,  ఎట్టకేలకు ఎన్నికల ప్రచారానికి దిగారు.

దీంతో బీజేపీ జనసేన శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.

బీ ఆర్ ఎస్,  కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తారని,  ఏపీలో పవన్ ఏవిధంగా వైసీపీ ప్రభుత్వం పైన,  జగన్ పైన విమర్శలు చేస్తున్నారో అంతే స్థాయిలో ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడతారని అంతా భావించినా,  పవన్ మాత్రం బి ఆర్ ఎస్( BRS party ) పైన, ఆ పార్టీ కీలక నేతల పైన విమర్శలు చేసే సాహసం చేయడం లేదన్నట్టుగా  పవన్( Pawan kalyan ) వైఖరి కనిపిస్తుంది.  దీంతో జనసేన , బిజెపి శ్రేణుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది .

పవన్ సభల పైన,  ప్రసంగాలపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన , బిజెపి శ్రేణులకు పవన్ ప్రసంగాలు అంతగా ఆకట్టుకోవడం లేదు.దీనికి కారణం బీ ఆర్ ఎస్  పైనా ఆయన విమర్శలు చేసేందుకు మొహమాట పడడమే కారణంగా తెలుస్తోంది.ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో కలిసి జనసేన పోటీ చేస్తుంది.

ఈ పొత్తులు భాగంగా ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా,  మిగతా అన్ని స్థానాల్లో బిజెపికి జనసేన మద్దతు పలుకుతుంది.ఈ నేపథ్యంలో బుధవారం నుంచి పవన్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.

Advertisement

కానీ పవన్ బీఆర్ఎస్ , కాంగ్రెస్ లపై విమర్శలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు .తెలంగాణ పౌరుషమే ఆంధ్రాలో పోరాడడానికి పనికి వచ్చింది అంటూ సెంటిమెంట్ డైలాగులు పవన్ చెబుతున్నా.పవన్ స్థాయిలో పంచ్ డైలాగులు లేకపోవడం వంటివి ఆయన అభిమానులకు రుచించడం లేదు.

 వరంగల్ సభలో పవన్ ప్రసంగం పెద్దగా ఆయన అభిమానులను జనసేన బిజెపి నాయకులు ఆకట్టుకోలేకపోయింది .అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి .వరంగల్ సభకు భారీగానే జనసేన , బిజెపి శ్రేణులు తరలి వచ్చాయి.ఏపీలో మాదిరిగా పవన్ పంచ్ డైలాగులు చెబుతూ,  కేసీఆర్ తో పాటు,  టిఆర్ఎస్ ప్రభుత్వం పైన , అలాగే కాంగ్రెస్ పైన విమర్శలతో విరుచుకుపడతారని అంతా ఊహించినా, తనకు కేటీఆర్ , రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఇద్దరు మంచి స్నేహితులు అంటూ వ్యాఖ్యానించడం వంటివి బిజెపి, జనసేన( BJP, Jana Sena ) శ్రేణులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో అధికార పార్టీ బీఆర్ ఎస్ ను విమర్శించేందుకు ఆ పార్టీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు పవన్ సాహసం చేయలేకపోతున్నారని,  ఒకవేళ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయంగాను,  సినీ పరంగాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతోనే ఆయన వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు