జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఢిల్లీలో రెండు రోజులు పర్యటించడం తెలిసిందే.ఈ పర్యటనలో బీజేపీ పార్టీ ముఖ్యనేతలతో కలిసి సమావేశమయ్యారు.
నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda )తో కూడా బేటి కావడం జరిగింది.ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ మరో కీలకనేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
అయితే భేటీ అనంతరం ఢిల్లీలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చాలా రోజుల నుండి అనుకుంటున్నా మీటింగ్ ఇది.గత రెండు రోజులుగా మేము మొత్తం మాట్లాడుకున్నది… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్థిరత్వం ఉండాలి.జనసేన బీజేపీ( Janasena BJP ) మెయిన్ ఎజెండా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్.
ఈ పొలిటికల్ లైన్ పైనే రెండు రోజులపాటు చర్చలు జరిపినట్లు పవన్ స్పష్టం చేశారు.ఈ విషయంపై అన్ని కోణాల నుంచి చాలా లోతుగా చర్చించాం.ఈ రెండు రోజులు జరిపిన చర్చల ఫలితాలు రాబోయే రోజుల్లో బలమైన.సత్ఫలితాలను తీసుకొస్తుందని భావిస్తున్నాం.
వచ్చే ఎన్నికలలో వైసీపీ( YCP )ని ఆంధ్రప్రదేశ్ పాలన నుంచి విముక్తి కలిగేలా ముందుకెళ్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.