'ఓజి' పనులు జోరుగా సాగుతున్నాయా.. ఈ పోస్ట్ చూస్తే మీరే ఒప్పుకుంటారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రెజెంట్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ తన లైనప్ ను గ్యాప్ లేకుండా సెట్ చేసుకున్నాడు.

దీంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అనే చెప్పాలి.కానీ పవన్ ఒకవైపు రాజకీయాలు.

మరో వైపు సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.పవన్ ఎప్పుడో ప్రకటించిన సినిమాలను పూర్తి చేయకుండానే మరిన్ని సినిమాలను ప్రకటిస్తున్నాడు.

అందుకే ఫ్యాన్స్ మొన్నటి వరకు కొద్దిగా ఈ విషయంలో నిరాశగా ఉన్నారు.అయితే పవర్ స్టార్ ఈ మధ్య స్పీడ్ పెంచేసాడు.

Advertisement

ఈయన ఇంతక ముందులా కాకుండా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక సినిమా షూట్ లో పాల్గొంటూ షూటింగులను పూర్తి చేస్తున్నాడు.

ముందుగా పవన్ రీమేక్ మూవీ వినోదయ సీతం సినిమాను( Vinodaya Seetha movie ) పూర్తి చేసాడు.కేవలం 22 రోజుల డేట్స్ లోనే తన పార్ట్ షూట్ పూర్తి చేసాడు.ఇక ఈ సినిమా తర్వాత ఏప్రిల్ 5న హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) సినిమా స్టార్ట్ చేసాడు.

ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు హరీష్ అధికారికంగా తెలిపాడు.ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగానే మధ్యలోనే ఆగిపోయిన హరిహర వీరమల్లు షూట్ లో అడుగు పెట్టబోతున్నాడు అని సమాచారం.

ఇలా పవన్ ప్రకటించిన అన్ని సినిమాలను కవర్ చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఇక ఈ సినిమాతో పాటు పవన్ చేతిలో ఉన్న మరో సినిమా ఓజి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యిన ఈ సినిమా నుండి ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందుతుంది.

Advertisement

ఈ సినిమా టెస్ట్ షూట్ లో ప్రస్తుతం బిజీగా ఉందని సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం ఇప్పుడు వైరల్ అయ్యింది.దీంతో ఈ సినిమా పనులు తెరవెనుక శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి అని తెలుస్తుంది.

తాజా వార్తలు