వెల్కమ్ టు జనసేన ! జంప్ జిలానీల కోసం పవన్ ఆరాటం !

రాజకీయాల్లోనూ .రాజకీయ నాయకుల్లోనూ నీతి నిజాయితీ అనేవి అసలు ఆశించకూడదు.

 Pawan Kalyan Welcomes Jumping Political Leaders Into The Party-TeluguStop.com

ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అలా ఉండడం ఎవరికీ సాధ్యమయ్యే పనే కాదన్న విషయం అందరికి తెలిసిందే.కానీ రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు వింటే మాత్రం చాలా మెత్తగా మాట్లాడుతూ ప్రజలను ఐస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

ప్రజలు ఒక పార్టీ మీద నమ్మకంతో ఓట్లు వేసి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే .అతడేమో గెలిచాక మరో పార్టీతో బేరసారాలు ఆడుకుని మరో పార్టీలోకి జంప్ చేయడం గత రెండు ఎన్నికల నుంచి ఎక్కువయిపోయింది.అంతే రాజకీయాలంటే ఇంతే.

ఇక విలువలతో కూడిన రాజకీయ ఎం చేస్తా నాకు పదవులు అవసరం లేదు.ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అంటూ వచ్చిన జనసేన అధినేత పవన్ కూడా ఎంత భారీ డైలాగులు చెప్పినా చివరకు అతడు కూడా అందరిలాంటి రాజకీయ నేతగానే కనిపిస్తున్నాడు.రాజీ లేని రాజకీయాలు చేస్తానంటూ.

రంగంలోకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా గోడ దూకుడు రాజకీయాలకు రాజీ పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.కంతేటి సత్యనారాయణ రాజు, చదల వాడ కృష్ణమూర్తి, ఆచంట నుంచి మల్లుల లక్ష్మీనారాయణ, ముమ్మడివరంలో పితాని బాలకృష్ణ, వంటి వారిని తన పార్టీలోకి చేర్చుకుని కండువా కప్పేశారు.

పవన్ కూడా ఎక్కువ గోదావరి జిల్లాల మీద కన్నేసినట్టు కనిపించినా … ఆయన కన్ను రాజధాని జిల్లా గుంటూరు మీద కూడా పడింది.ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రధాన రెండు పార్టీల నుంచి ఎంతమంది నాయకులు జనసేనలో చేరతారా అనే లెక్కల్లో ఉన్నాడు.

ఎన్నికలకు ముందు నాయకులు తాము ఆశించిన విధంగా అటు టీడీపీలోకానీ, ఇటు వైసీపీలో కానీ టికెట్లు లభించని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఇక, జనసేనలోకి చేరేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.దీనిపై సమాచారం అందుకున్న పవన్ కూడా ఈ వ్యూహమే బెటర్ అనుకున్నట్టు తెలుస్తోంది.

అందుకే ఆయనకూడా ఎన్నికల వరకు ఎవరినీ కదపకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసంతృప్తులకు టికెట్లు ఇచ్చి రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచనలో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube