కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ వీడియో..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విన్నపం చేస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో ప్రజలంతా టీడీపీ-బీజేపీ-జనసేన( TDP BJP Janasena ) అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.

మే 13వ తారీకు ఎన్నికలు జరగబోతున్నాయి.మన భవిష్యత్తును మనం నిర్దేశించుకునే సమయం.

ఈ ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎక్కడైతే బీజేపీ నేతలు పోటీ చేస్తున్నారో అక్కడ జనసేన, టీడీపీ మద్దతుదారులు అండగా నిలబడాలి.అలాగే ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ బీజేపీ, జనసేన నాయకులు అండగా ఉండాలి.

అదేవిధంగా జనసేన( Janasena ) పోటీ చేస్తున్న చోట్ల టీడీపీ, బీజేపీ మద్దతుదారులు అండగా నిలబడాలి.అందరూ సమిష్టిగా ఏపీలో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.కూటమి విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ వంటి ఆరు అంశాలతో ముందుకెళ్తాంది అని పేర్కొన్నారు.

Advertisement

అన్ని వర్గాల ప్రజలకు మేము అండగా ఉంటాం.మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రజలంతా కూటమి అభ్యర్థులను గెలిపించండి.

బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న ఈ దేశం కచ్చితంగా మోడీ ఆశీస్సులు మన రాష్ట్రానికి కూడా ఉండాలి.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమని వీడియోలో పవన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు