టీజర్ టాక్: వకీల్ సాబ్ కోటు తీశాడంటే అంతే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్ర టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం కోసమే కాదు, ఈ చిత్ర టీజర్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎందుకు అంత భారీ అంచనాలు నెలకొన్నాయో ఈ టీజర్ చూస్తే ఇట్టే తెలుస్తోంది.లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ తన ప్రేక్షకులు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఇక ఈ టీజర్ ఆద్యాంతం పవర్ స్టార్‌ను ఎలివేట్ చేసిన విధానం అభిమానులకు నిజమైన సంక్రాంతి పండుగ కానుక అని చెప్పాలి.ఈ టీజర్‌లో పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో పాటు ఆయన్ను ప్రెజెంట్ చేసిన విధానం సూపర్బ్.

ఇక టీజర్‌లో పవన్ చెప్పిన డైలాగు పీక్స్ అని చెప్పాలి.‘కోర్టులో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అనే డైలాగును పవన్ చాలా పవర్‌ఫుల్‌గా చెప్పడంతో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.

Advertisement

ఇక ఈ టీజర్ మొత్తంలో పవన్ మెయిన్ హైలైట్ కాగా మరో హైలైట్‌గా థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నిలిచింది.చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్న బీజీఎం ఈ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

బీజీఎం అందించడంలో థమన్ ఎందుకంత స్పెషల్ అనేది ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది.పవన్ లుక్స్, అదిరిపోయే డైలాగ్‌తో పాటు బీజీఎం కలగలిసి ఈ టీజర్‌ను సూపర్‌గా మలిచాయి.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.పవన్ భార్య పాత్రలో శృతి హాసన్ కేమియో రోల్ చేస్తున్న సంగతి తెలిసందే.

మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వకీల్ సాబ్ టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు