మహేష్ ఎన్టీఆర్ ఆనందాన్ని లాక్కున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటాడు.వరుసపెట్టి రికార్డుల మోత మొగిస్తున్నాడు.గత రెండు సంవత్సాలుగా మహేష్ జేబులో పెట్టుకొని తిరుగుతున్న రికార్డులనే కాకుండా, నిన్న గాక మొన్న ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డుని కూడా లాక్కున్నాడు.

 Pawan Kalyan Trashed Mahesh & Ntr Records-TeluguStop.com

1-నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు .బాహుబలిని మినహాయిస్తే, వరుసగా మూడు సార్లు అత్యధిక ప్రీ – రిలీజ్ బిజినెస్ రికార్డులు నెలకొల్పాడు సూపర్ స్టార్ మహేష్.వాటిని ఎన్టీఆర్ బద్దలు కొట్టలేకపోయాడు.కాని పవర్ స్టార్ మిస్ అవలేదు కదా, చాలా పెద్ద మార్జిన్ తో రికార్డులకు చెక్ పెట్టేసాడు.60 కోట్ల థియేటరికల్ బిజినెస్ తో శ్రీమంతుడు టాప్ లో ఉంటె, దాన్ని 18 కోట్లతో వెనక్కి నెట్టి 78 కోట్ల బిజినెస్ తో సర్దార్ గబ్బర్ సింగ్ ని అగ్రస్థానంలో కూర్చోబెట్టాడు.పవన్ కళ్యాన్ క్రేజ్ కి గబ్బర్ సింగ్ బ్రాండ్ తోడవడంతో రికార్డులు పరుగుల తీస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్ తన అడ్డ సీడెడ్ లో రెండు రోజుల క్రితమే జనత గ్యారేజ్ కి 9 కోట్ల బిజినెస్ తెప్పించి ఆ ఆనందాన్ని సరిగా అస్వాదించకముందే సీడెడ్ లో 10 కోట్ల బిజినెస్ తో జెండా ఎగురవేశాడు గబ్బరోడు.

సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube