రేప్ చేస్తుంటే చేయించుకోవాలా ?

ఒక మనిషి ఒక ఆడ వ్యక్తి మీద పడి దాడి చేస్తూ , రేప్ చెయ్యడానికి ప్రయత్నిస్తే ఏం చెయ్యాలి ? ప్రతిఘటించి, దగ్గర ఏదుంటే దాంతో అతన్ని గాయ పరచాలి.అతని నుంచి తప్పించుకోవడం కోసం తన వద్ద ఉన్న దేన్నైనా సరే వాడి తప్పించుకోవాల్సిందే.

 Denmark Police Fine Girl For Using Pepper Spray-TeluguStop.com

కానీ డెన్మార్క్ దేశం లో ఒక వింత తీర్పు వెలువడింది.

డెన్మార్క్ లోని సోండెర్ బర్గ్ ప్రాంతంలో ఒక యువతి రాత్రివేళ ఒక్కతే నడుచుకుంటూ వెళుతోంది.

ఈ క్రమంలో ఒక ఆగంతకుడు సదరు యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.యువతిని కిందపడేసి ఆమె స్కర్ట్ ను తొలగించే ప్రయత్నం చేశాడు.

ఈ సమయంలో తనను తాను కాపాడుకోవటానికి వీలుగా తనపై రేప్ కు పాల్పడుతున్న వ్యక్తిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించింది.

అనంతరం అతడి బారి నుంచి తప్పించుకుంది.

తనను రేప్ చేయటానికి ప్రయత్నించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయటానికి వెళ్లిన బాధితురాలికి అక్కడి పోలీసుల ప్రవర్తన షాకింగ్ గా మారింది.ఆమె ఇచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టి.

ఆగంతకుడిపై పెప్పర్ స్ర్పే వాడినందుకు ఎదురు కేసు పెట్టారట.అదేమంటే.

డెన్మార్క్ చట్టాల ప్రకారం.ఎట్టి పరిస్థితుల్లోనూ పెప్పర్ స్ర్పే వాడకూడదన్న విషయాన్ని మర్చిపోయావా? అని అడుగుతున్నారట.చట్టాన్ని ఉల్లంగించింది అంటూ ఆమె మీద యాభై వేలు జరిమానా వేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube