బాలీవుడ్ – కాలీవుడ్ లలో సాలా ఖదూస్ సినిమా హడావిడి ఎక్కువగా ఉంది.తమిళ – హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అయిన ఈ సినిమా లో తమిళ్ హీరో మాధవన్ బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తాడు.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ మొదటి సారిగా నిర్మించిన ఈ సినిమా ని తమిళ్ లో ‘ ఇరుద సూత్రు’ పేరుతో విడుదల చేసారు.
ఈ సినిమా లో సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా ఒక భాగం గా వాడి పడేసారు.
కానీ ఈ విషయం రజినీకాంత్ కి కూడా తెలీదు.తర్వాత ప్రాజెక్ట్ విషయంలోనే వీరిద్దరూ ఇలా చర్చించుకున్నారని అంటున్నారు ఇదంతా గమనించిన వాళ్లు.
సాలా ఖడూస్ స్టోరీలో భాగంగా హీరోకి తన సీనియర్ తో వివాదం రావడంతో.చెన్నైకి ట్రాన్స్ ఫర్ చేస్తారు.
అక్కడికి వెళ్లాక.ప్రతీ చోటా రజినీ ఫోటోలు – బ్యానర్లు చూపిస్తూ.
మూవీకి సూపర్ స్టార్ ఫ్లేవర్ అద్దేశారు.
రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ లెక్కలో ఇది బాగా ప్లస్ పాయింట్ అయ్యి తీరుతుంది అన్నమాట.
అయితే హిందీ వెర్షన్ లో కూడా దీన్ని ఎక్కడా తొలగించకుండా అలా కాపాడుకుంటూ వచ్చారు నిర్మాతలు.తెలుగు లేడీ డైరెక్టర్ సుధా డైరెక్ట్ చేసిన ఈ సినిమా కి రితికా సింగ్ అనే స్పోర్ట్స్ అమ్మాయి ముఖ్య పాత్ర పోషించింది.







