పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెడుతున్నాడు.దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాతో టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను ఢీకొట్టేందుకు పవన్ రెడీ అవుతున్నాడట.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీని జనవరి 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే పవన్ కూడా తన 27వ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో ఎప్పుడూ జరగని బిగ్గెస్ట్ ఫైట్ బాక్సాఫీస్ వద్ద చోటు చేసుకుంటుంది.
ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ను పవన్ లాంటి సూపర్ క్రేజ్ హీరో ఢీ కొట్టడం అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోగలం.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పవన్ చేయబోయే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్త పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ అభిమానుల్లో తెగ చర్చనీయాంశంగా మారింది.