నిర్మాతలకు పవన్ అభయం.. ఆ సినిమాల విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) ఇప్పటికే ప్రకటించిన మూడు సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతాయనే గందరగోళం ఫ్యాన్స్ లో ఉంది.

కొన్నిరోజులు మాత్రమే షూటింగ్ జరుపుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ అసలు విడుదలవుతుందా లేదా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరిగింది.

అయితే నిర్మాతలకు పవన్ అభయం ఇచ్చారని సమాచారం అందుతుండటం గమనార్హం.ఇప్పటికే కొంతమేర షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాలన్నీ కచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాతలకు( producers ) పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది.

పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలలో నటిస్తారనే వార్త ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ సినిమాలకు సంబంధించి అభిమానులకు ఎలాంటి సందేహం అవసరం లేదని క్లారిటీ వచ్చేసింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh )కు పవన్ 60 రోజుల డేట్లు కేటాయించాల్సి ఉంటుంది.

Pawan Kalyan Promise To His Producers Details Inside Goes Viral In Social Media
Advertisement
Pawan Kalyan Promise To His Producers Details Inside Goes Viral In Social Media

ఓజీ, హరిహర వీరమల్లు( OG, Harihara Veeramallu ) సినిమాలకు పవన్ చెరో 15 రోజుల డేట్లు కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది.ఈ రెండు సినిమాలు 2025 సంవత్సరం ఫస్టాఫ్ లోనే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని భోగట్టా.పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమాలకు డేట్స్ ఇచ్చినా బల్క్ డేట్స్ ఇవ్వడం మాత్రం కష్టమని సమాచారం అందుతోంది.

Pawan Kalyan Promise To His Producers Details Inside Goes Viral In Social Media

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంచనాలకు మించి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇక సినిమాల్లో అదే మ్యాజిక్ రిపీట్ చేయాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో పవన్ కళ్యాణ్ నటిస్తుండటం గమనార్హం.పవన్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.పవన్ భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు