ఏపీ రాజకీయాలు ఇప్పుడు కులాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.ఇంతకాలం ప్రగతి బేస్ గా రాజకీయాలు జరిగితే.
పవన్ వచ్చాక కులాలు చుట్టూ తిరగడం మొదలు అయింది.కాపుల ఓట్ల కోసం పవన్ కుల రాజకీయం మొదలు పెట్టారు.
తన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం.ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం అంతర్గతంగా జరుగుతూనే ఉంది.
దాంతో భారీ స్థాయిలో కుల ఓట్లు పవన్ ఖాతాలో చేరుతూ ఉన్నాయి.
అయితే ఇదంతా టీడీపీ కి మైనస్ గా మారుతున్నాయి.
అది గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ నీ పక్కన పెట్టుకొని.తన కేడర్ ను కాపాడు కుంటు ఉన్నాడు.
కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకుని బీజేపీ ఎప్పటి నుంచో రాజకీయం చేస్తోంది.అధ్యక్షుల అందరినీ అదే సామాజిక వర్గం నుంచి ఎంచుకుని తీసుకు వచ్చింది.మొన్నటి దాకా ఉన్న కన్నా లక్ష్మినారాయణ, ఇప్పుడు ఉన్న సోము వీర్రాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు.2014 లో అదే ఓటు బ్యాంక్ కోసం అటు పవన్ ను ఇటు బీజేపీ నీ నమ్ముకొని ఎన్నికల్లో వెళ్లారు.

ఈ సారి ఆ పరిస్థితులు కనిపించడం లేదు.బీజేపీ లో ఉన్న కేడర్ మొత్తం పవన్ చుట్టూ తిరుగుతూ ఉండటం తో.చంద్రబాబు వాళ్ళను పట్టించుకోవడం కూడా మానేశాడు.దాంతో ఆయన పై రాష్ట్ర బీజేపీ ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది.
పవన్ ను పొత్తులకు పిలిచి తమను పట్టించు కొకపోవడం తో.బాగా హట్ అయ్యారు.అందుకే బాబును తామే దూరం పెడుతున్నాం అని చెబుతూ ఉన్నారు.

జనసేన మాత్రం తను ఎదగడానికి బాబును పట్టుకొని తిరుగుతూ ఉన్నారు.ఈ సారి ఒంటరిగా పోటీ చేస్తే 2019 రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని మొదటి నుంచి భయపడుతూ ఉన్నారు.అందుకే బాబును ఒప్పించి 30 సీట్లు తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారు.
వాటిలో సుమారు ఒక 15 సీట్ల నుంచి 20 గెలిచినా.అది వచ్చే ఎన్నికల్లో కలసి వస్తుంది అని గట్టిగ నమ్ముతు ఉన్నారు.
అయితే ఇక్కడ బీజేపీ అలిగి ఉన్నా .వాళ్ళను పట్టించుకోవడం లేదు.బీజేపీ కూడా తమ సీఎం అభ్యర్థి పవన్ అని ఒప్పుకోక పోవడం తో.పవన్ కూడా వాళ్ళను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.మరి వచ్చే ఎన్నికల్లో పవన్ వ్యూహం ప్రకారం సీట్లు గెలుచుకుంటే.అటు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ పొత్తు లేకుండా.ప్రజల్లోకి వెళ్ళాలి అని చూస్తూ ఉన్నాడు.టిడిపి కి బీజేపీ కటీఫ్ చెబుతున్నా.
పవన్ పెద్దగా పట్టించుకోవడం లేదు.మరి బీజేపీ జేఎస్పీ పొత్తు మరి కొన్ని రోజుల్లో పోతుంది అనేది విశ్లేషకుల అంచనా.
మరి బీజేపీ అలకను బాబు అర్థం చేసుకొని అక్కున చేర్చుకుంటాడా.? లేదా.? చూడాలి
.