త్వరలో తెలంగాణ అధ్యక్షుడి మార్పు..! నెక్స్ట్ బాస్ ఎవరంటే..?

తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతోంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షులు గా ఇంతకు ముందు పనిచేసిన డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ కి ఇక్కడ పునాదులు వేస్తే.

 Telangana President Change Soon Who Is The Next Boss ,mp Bandi Sanjay, Mla Etela-TeluguStop.com

అర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన బండి సంజయ్ ఏకంగా భవన నిర్మాణానికి పూనుకున్నారు.విడతలు విడతలు గా పడ యాత్రలు చేస్తూ.

నిత్యం ప్రజల్లో ఉంటూ.ఆ పార్టీ కి ఉపును తీసుకు వచ్చారు.

ఒకవైపు సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తూనే.మరో వైపు పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు.

అందులో భాగంగా చాలా మార్పులు తీసుకొని వచ్చారు.బీజేపీ కి బ్యాక్ బోన్ గా.యువతను మార్చారు.

ప్రతి గ్రామం లోనూ బీజేపీ జెండా ఉండాలి అని.అన్ని ఉర్లను చుట్టేశారు.ఇక ఉత్తరాదిన పని చేసిన కషాయం ఎజెండా తెలంగాణ లో పని చేయదు అని ముందే ఊహించిన సంజయ్.

కొత్త స్ట్రాటజీ తో ముందుకు పోతున్నారు.కేవలం ప్రభుత్వం పై విమర్శలు చేయడం.

ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం, ఉద్యమ నాయకులను అక్కున చేర్చుకోవడం లాంటి వాటితో.బీజేపీ ను బాగా వ్యాపింప జేశారు.

బండి సంజయ్ నాయకత్వం వచ్చాక బీజేపీ బాగా నే పుంజుకుంది.

బండి సంజయ్ కు పెద్దగా వాక్ చాతుర్యం లేకపోయినా.

సమయస్ఫూర్తి.నాయకత్వ లక్షణాలతో.

పార్టీకి వైభవం తీసుకు వచ్చారు.అయితే అన్ని పార్టీ ల్లో మాదిరి కాకుండా.

బీజేపీ కి ఒక సిద్ధాంతం ఉంది.దాని ప్రకారం కష్టపడిన వారికి గుర్తింపు ఇస్తుంది.

అందుకోసం బండి సంజయ్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Amith Sha, Bjp Cheaf, Cm Kcr, Dr Laxman, Kishan Reddy, Mp Bandi Sanjay-Po

బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి.కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.మొన్న జరిగిన సమావేశం లో కూడా.

బండి సంజయ్ ఈ మార్పు పై లీక్ ఇచ్చారు.పార్టీలో పదవులు శాశ్వతం కాదని.

పార్టీ కోసమా అంతా పని చేయాలని.పదవిలో ఎవరు ఉన్నా.

వాళ్ళ ఆదేశాలు ఫాలో కావాలని అన్నారు.దాంతో అంతా ఊహించిన విధంగా నే బండి మాట్లాడారు అని తెలుస్తోంది.

Telugu Amith Sha, Bjp Cheaf, Cm Kcr, Dr Laxman, Kishan Reddy, Mp Bandi Sanjay-Po

ఇక బీజేపీ లోకి చేరిన దగ్గరి నుంచి ఈటెల రాజేంద్ర చాలా కష్టపడుతూ ఉన్నారు.అందులోనూ తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగిన నేత.ప్రజల్లోనూ అయన పై సానుకూలత, సానుభూతి ఉన్నాయి.వాటిని ఉపయోగించుకుంటు.

ఆయనకు సముచిత స్థానం కల్పించారు.ఇప్పుడు ఆయన సారథ్యం లో మరో ముందడుగు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈటెల రాజేంద్ర కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఈటెల మాత్రమే కెసిఆర్ ను ఎదుర్కొన గాలరు.

కేసిఆర్ బలా బలాలు తెలిసిన నేత.పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ కి సువెందు అధికారి తో చెక్ పెట్టినట్టు.ఇక్కడ కెసిఆర్ కు ఈటెల తో చెక్ పెట్టాలి అని చూస్తున్నారు.మరి బీజేపీ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube