తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ ఎన్నో అద్భుతమైన పౌరాణిక సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇలా సూపర్ హిట్ సినిమాల ద్వారా దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ తాజాగా సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేయగా ఈ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియచేశారు.ముఖ్యంగా ఈ సినిమాలో సమంతను ఎంపిక చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని కూడా ఈయన తెలియజేశారు.

తన కుమార్తె నీలిమ విదేశాల నుంచి వచ్చి నిర్మాతగా స్థిరపడాలని భావించారు.అయితే ఒక మంచి కథను సెలెక్ట్ చేయమని చెప్పారు.ఈ క్రమంలోనే శాకుంతలం సినిమాని సెలెక్ట్ చేసుకున్నామని తెలిపారు.ఇలాంటి ఒక పౌరాణిక చిత్రంలో నటించడానికి సరైన నటి ఎవరు అని అనుకుంటున్నా సమయంలో నీలిమ సమంత పేరును చెప్పింది.
అయితే సమంత చాలా మోడ్రన్ హీరోయిన్ శకుంతలగా ఆమె సూట్ అవుతుందా అన్న సందేహం కలిగింది.

అయితే ఈ సినిమా కథ రాస్తున్న సమయంలో సమంత నటించిన రామలక్ష్మీ పాత్ర తనకు మదిలో మెలిగిందని గుణశేఖర్ తెలిపారు.ఎంతో మోడ్రన్ గా ఉన్న ఒక హీరోయిన్ అచ్చం పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఎంతో ఒదిగిపోయిన నటించారు.ఇక ఈ పాత్రకు కూడా సమంత సరిగ్గా సరిపోతుందని భావించారట.
ఇక సమంతను కలిసి ఈ కథ చెబుతున్నప్పుడు తనలో నాకు సమంత కనపడలేదని శకుంతల కనిపించిందని అందుకే ఈ సినిమాలో సమంతని ఎంపిక చేసామంటూ గుణశేఖర్ తెలిపారు.







