మరోసారి గ్లాస్ డైలాగ్ పై స్పందించిన పవన్.. కృతజ్ఞతలు తెలిపిన హరీష్ శంకర్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు.ఈయన ఇటీవల నటిస్తున్నటువంటి చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagath Singh ) ఒకటి.

 Pawan Kalyan Once Again Comments About Glass Dialogue Details, Pawan Kalyan, Har-TeluguStop.com

డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమా దాదాపు 50% వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఇటీవల ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

భగత్స్ బ్లేజ్ అంటూ ఒక చిన్న వీడియోని విడుదల చేశారు.

ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి గ్లాస్ డైలాగ్స్( Glass Dialogue ) భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి గ్లాస్ అంటే సైజు కాదు అది సైన్యం అని కనిపించని ఒక సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ డైలాగ్స్ తన జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఈ గ్లాస్ డైలాగు గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.ఓ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ ఇష్టం ఉండదని తెలిపారు.

కానీ ఎందుకు ఇలాంటి డైలాగ్స్ పెట్టారని డైరెక్టర్ హరీష్ ను తను అడిగాను.

ఈ ప్రశ్నకు హరీష్ సమాధానం చెబుతూ మా బాధలు మాకు ఉన్నాయి సర్.ఇలాంటి డైలాగులు కనుక రాయకపోతే మీ అభిమానులు అసలు ఊరుకోరు అంటూ నాకు సమాధానం చెప్పారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు.మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్.

మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తాము అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube