జనసేన కు చిక్కులు తెచ్చిన నాగబాబు స్టేట్మెంట్ ?

రాజకీయం ఉనికి కోసం ఆరాటపడుతున్న జనసేన పార్టీ, రాజకీయంగా మైలేజ్ పొందేందుకు ఏదో ఒక అంశంపై నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.దీనిద్వారా ప్రజల్లోనే కాకుండా, పార్టీ కార్యకర్తల్లో కూడా జోష్ పెంచాలని చూస్తున్నారు.

2024 నాటికి బిజెపి సహకారంతో ఏపిలో అధికారం చేపట్టాలని పవన్ ఆశపడుతున్నారు.దానికి అనుగుణంగానే రాజకీయంగా ఒక్కో అడుగు జాగ్రత్తగా ముందుకు వేసుకుంటూ వస్తున్నారు.

ఎక్కడా వివాదాల జోలికి పోకుండా, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని గుర్తించి దానికి సంబంధించిన వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ సోదరుడు నాగబాబు కారణంగా పవన్ చిక్కుల్లో పడినట్టుగా జనసేనాని కనిపిస్తున్నారు.

సాధారణంగానే పవన్ ఎక్కువగా గాంధేయ వాదం గురించి మాట్లాడతారు.వాటిని ప్రచారం చేస్తారు.

Advertisement

అటువంటిది ఇప్పుడు పవన్ సోదరుడు నాగబాబు హఠాత్తుగా గాంధీజీని చంపిన గాడ్సేను పొగుడుతూ ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ నాగబాబు ఆయనను పొగిడారు.

ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అసలు సమయం సందర్భం లేకుండా నాగబాబు ఈ అంశాన్ని ఎత్తుకోవడం ఏంటనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.ఇప్పటికే నాగబాబుపై తెలంగాణలో పోలీస్ కేసు కూడా నమోదైంది.

ఈ వివాదం మరింత ముదిరేలా కనిపించడంతో ఈ విషయంపై జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.సోషల్ మీడియాలో నాగబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే కొంతమంది జనసేన నాయకులు ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు.గాడ్సే పై నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దీంట్లో పార్టీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

అసలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు గాని, జాతీయ అంతర్జాతీయ, దేశభక్తి వంటి అంశాలపై ఎక్కడ సీరియస్ గా వ్యాఖ్యానించిన సందర్భాలు లేవు.ఇప్పుడు మాట్లాడినా రాష్ట్ర పరిధిలో మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు.

Advertisement

కానీ అకస్మాత్తుగా నాగబాబు గాడ్సే అంశాన్ని తెరకెత్తుకున్నారు.దీనిపై విమర్శలు వస్తాయని తెలిసినా, దీనిపై మాట్లాడడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఇక ఈ వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎంటరయ్యారు.నాగబాబు చెప్పింది కరెక్టేనంటూ ఎప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు.

అంతేకాకుండా గాడ్సే పై సినిమా తీస్తానని ప్రకటించారు.

కానీ పవన్ మాత్రం ఈ విషయంలో తన అన్న వ్యాఖ్యలు సమర్ధించలేక , విమర్శించలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయంలో పవన్ ను స్పందించాలి అంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి.అయితే పవన్ మాత్రం ఈ విషయంలో స్పందిస్తే అనవసర చిక్కుల్లోపడతాను అనే భావంతో సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు