Pawan Kalyan Harish Shankar : పవన్ కోసం హరీష్ స్క్రిప్ట్ లో మార్పులు.. ఇప్పటి ట్రెండ్ ను ఫాలో అవుతూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మునపటి కంటే ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.

ఈయన ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక ఆపకుండా సినిమాలు చేస్తాడు అని అనుకుంటే పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమాలకు గ్యాప్ తప్పలేదు.

పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే వీరి కాంబోలో సినిమా ప్రకటించారు కూడా.

ఈ క్రేజీ కలయికలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ప్రకటించారు.అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యింది కానీ ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో అసలు పవన్ ఈ సినిమాను చేస్తాడా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి.

Advertisement

ఈ క్రమంలోనే మరో క్రేజీ రూమర్ బయటకు వచ్చింది.అది ఏంటంటే.

హరీష్ శంకర్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ కు తగినట్టు పవర్ స్టార్ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడు అని టాక్.ఎప్పుడో పవన్ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన హరీష్ ఇప్పుడు ట్రెండ్ కు తగినట్టుగా మార్పులు చేయనున్నారని.

పవన్ కూడా స్క్రిప్ట్ మార్చమని అడగడంతో ఈయన ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ కోసం ఈసారి హరీష్ ఒక యూనిక్ నెస్ తో కూడుకున్న కమర్షియల్ స్క్రిప్ట్ ను రాసాడని.ఈ స్క్రిప్ట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మెప్పిస్తాడని నమ్మకంతో ఉన్నారు.ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

మరోసారి గబ్బర్ సింగ్ ను మించిన హిట్ అందిస్తాడో లేదో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు