తెలుగుదేశం పార్టీతో కనీసం 10 ఏళ్లయిన పొత్తు ఉండాలి పవన్ కీలక వ్యాఖ్యలు..!!

మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం భారీగా చేరికలు జరిగాయి.విశాఖపట్నం మరియు మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఇతర పార్టీలకు చెందిన నాయకులు.

 Pawan Kalyan Key Comments Should Be At Least 10 Years Alliance With Telugu Desam-TeluguStop.com

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.ముఖ్యంగా విశాఖపట్నం నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్ డాక్టర్ మహమ్మద్ సాదిక్, ప్రకాశం దర్శి నుంచి శ్రీ గరికపాటి వెంకట్ లు జనసేనలో జాయిన్ కావడం జరిగింది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీతో కనీసం 10 సంవత్సరాలు పొత్తు ఉండాలని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ( YCP )కి ఒక సీటు కూడా వెళ్లకుండా జనసేన పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు.నీటి సమస్యలు వలసలు తగ్గి… రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలి.

మైనారిటీ అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం.వారికి అన్యాయం జరిగితే మైనార్టీల వైపే నేను పోరాడుతా.

అని పవన్ భరోసా ఇచ్చారు.వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారింది.

ఏపీని గాడిలో పెట్టాలి. బీజేపీ( BJP )తో కలిసి ఉండటంవల్ల కొందరు మైనారిటీలు.

రాలేకపోతున్నట్లు చెప్పారు.మత విపక్ష చూపించనని మాట ఇస్తున్నాను.

మాట ఇస్తే వెనక్కి తగ్గను.కులం, మతం దాటి వచ్చే ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడను అండగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube