పవన్ మరో సంచలన యాత్ర...త్వరలో ప్రకటన..???

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయాలని వాయిదా పద్దతుల్లో వేడెక్కిస్తున్నారు.ఒక్క సారిగా బాంబ్ బ్లాస్ట్ చేసేస్తే కిక్కు ఉండదు అనుకున్నాడో ఏమో కాని.

ఏపీలో కాకలు తీరిన సీనియర్ పార్టీల అధినేతలకి విడతల వారీగా చుక్కలు చూపిస్తున్నాడు.అయితే పవన్ ధాటికి ఎక్కువగా చుక్కలు లెక్కపెట్టింది, పెడుతోంది టీడీపీ నే అయినా వైసీపీ పై ఆ ప్రభావం ఏమాత్రం పని చేయడం లేదు.

జగన్ చేపట్టిన పాదయాత్ర ముందు పవన్ వ్యూహాలు ఫలించలేదు.అయితే.

ఒక పక్క జగన్ యాత్ర అయిపోగానే ఇప్పుడు ఏపీలో ప్రజలు ఎవరు ఏ యాత్ర చేపడుతారో అని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక్క సారిగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.ఈ నిర్ణయంతో మరో సారి ఇరకాటంలో పడేది కూడా టీడీపీ పార్టీనే అనే టాక్ కూడా వినిపిస్తోంది.ఇంతకీ పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ఎలా ఉండబోతోంది.?? దానికి కారణాలు ఏమిటి.?? అసలు ఆయాత్ర ఎవరి కోసం.?? ఈ వివరాలు తెలియాలంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ న్యూస్ తెలుసుకోవాల్సిందే.పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయినట్టు ప్రకటించి నేరుగా ప్రయా పోరాట యాత్రలోకి దిగిపోయాడు.

Advertisement

ఈ యాత్రలో భాగంగా టీడీపీ ప్రభుత్వాన్ని ,వైసీపీని మాములుగా ఉతికి ఆరేయలేదు.ఆ సంగతులు కూడా అందరికి తెలిసిందే.అయితే ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ కొన్ని వర్గాల నుంచీ వచ్చిన వినతులని స్వీకరించి వారితో నేరుగా ముఖాముఖి కార్యక్రమం పెట్టి అధికారంలోకి వచ్చినా రాకపోయినా మీ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నాడు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వివిధ రైతు సంఘాలతో , రైతులతో నేరుగా మాట్లాడి వారి భాధలు తెలుసుకున్నాడు.

ఉభయగోదావరి జిల్లాలు అంటేనే రైతులకి కొలువైన భూమిగా చూస్తారు ,పైగా ఈ జిల్లాలు పవన్ కళ్యాణ్ కి సొంత జిల్లాలు కావడంతో పాటు, రాజకీయంగా పార్టీల తలరాతలని డిసైడ్ చేసేవి కూడా ఈ జిల్లాలే కావడంతో పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలపై ప్రత్యెక దృష్టి పెట్టి ఇప్పటి వరకూ చేసిన పోరాట యాత్రకి శుభం కార్డ్ వేసి తాజా వ్యూహాల ప్రకారం.నాదెండ్ల తో సంప్రదింపులు జరిగిపిన తరువాత ఓ కీలక నిర్ణయానికి వచ్చారాని అంటున్నారు.అదేంటంటే.

ఏపీలో త్వరలో భారీ స్థాయిలో పశ్చిమ నుంచీ రైతు ఉద్యమం మొదలు పెట్టనున్నారని , ఈ ఉద్యమాన్ని పాదయాత్రతో మొదలు పెట్టాలా.?? లేక బస్సు యాత్రగా మొదలు పెట్టాలా అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే కేవలం ఉభయగోదావరి జిల్లాలలో మాత్రమె చేపట్టాలని అనుకున్నారు కాబట్టి పాదయాత్ర ద్వారా రైతుల వద్దకి వెళ్తేనే మంచిదనే భావనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇది కేవలం సోషల్ మీడియాలో వస్తున్నా ఊహాగానేమే తప్ప పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జనసేన నేతలు అంటున్నారు.అంతేకాదు పవన్ ఈ కార్యక్రమ చేపడితే తప్పకుండా రాబోయే ఎన్నికలకి మంచి మైలేజ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు.

Advertisement

మరి పవన్ ఈ ఊహలని నిజం చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు