తెలంగాణ ఎన్నికల పోరు నుండి తప్పుకోనున్న జనసేన..? కారణం అదేనా!

వచ్చే నెలలో తెలంగాణా( Telangana Elections )లో ప్రాంతం లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ ఎన్నికలలో ఎప్పటి లాగానే టీడీపీ మరియు వైసీపీ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి.

కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రం 32 తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభ్యర్థులతో సహా అధికారికంగా ప్రకటించాడు.ఈ నెలలో ఎన్నికల ప్రచారం చేద్దామని అనుకున్నాడు కానీ, కృష్ణ జిల్లా వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) చేస్తుండగా, ఆయనకీ వైరల్ ఫీవర్ రావడం, ఈ నెల 20 వ తారీఖు నుండి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కొత్త షెడ్యూల్ లో పాల్గొనడం, ఆ తర్వాత వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి కి హాజరు అవ్వడం.

ఈ నెల మొత్తం ఆయన షెడ్యూల్ ఇలా ఫిక్స్ చెయ్యబడింది.కాబట్టి తెలంగాణ లో ఎన్నికల ప్రచారం అనేది ఇప్పట్లో దాదాపుగా లేనట్టే.

కొంత మంది అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలలో పోటీ నుండి తప్పుకోబోతున్నాడని అంటున్నారు.కారణం తెలంగాణ లో ఒక్క నియోజకవర్గం లో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు.ఇప్పుడు ఆయన వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా కూడా డిపాజిట్స్ ఈ ప్రాంతం లో దక్కే అవకాశం కనిపించడం లేదు.

Advertisement

ఈ ఎన్నికల ఫలితం ని అడ్డు పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ( YCP ) జనసేన మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు చెయ్యొచ్చు.పవన్ కళ్యాణ్ మీద జనాల్లో ఇంకా విశ్వాసం లేదు అనడానికి నిదర్శనం తెలంగాణ ఎన్నికలే అంటూ ఒక రేంజ్ లో తమ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసే అవకాశం ఉంది.

ఇది ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది, కాబట్టి ఇప్పుడు ఎన్నికల నుండి తప్పుకోవడమే బెటర్ అని పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీలోని ముఖ్య నాయకులూ చెప్పారట.

వాళ్ళు చెప్పిన పాయింట్స్ ని పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ పునరాలోచిస్తున్నాడట.మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.32 స్థానాల్లో పోటీ చేస్తున్నాం అని పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి, 32 నియోజకవర్గాల్లో తిరగాల్సిన అవసరం ఉంది.ఉన్న నెల రోజుల సమయం లో అది సాద్య పడుతుందా అంటే అనుమానమే.

గతం లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తమ పార్టీ తరుపున అభ్యర్థులను ప్రకటించి, చివరి నిమిషం లో బీజేపీ( BJP Senior Leaders ) పార్టీ పెద్దల రిక్వెస్ట్ మేరకు ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నాడు పవన్ కళ్యాణ్.మరి ఈసారి కూడా అలాంటి సందర్భం రానుందో లేదో చూడాలి.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు