హరీష్-పవన్ మూవీ అప్డేట్.. ఆ సినిమాకు రీమేక్.. నిజమేనట!

Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh Details, Ustaad Bhagat Singh, Pawan Kalyan, Harish Shankar, Theri Remake, Mythri Movie Makers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు.ఈయన లైనప్ చూసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

 Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh Details, Ustaad Bhagat Singh, Pa-TeluguStop.com

ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమా త్వరలోనే షూట్ పూర్తి కానున్న నేపథ్యంలో మరి కొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు.మరి పవర్ స్టార్ లైనప్ లో ముందుగా ఉంది హరీష్ శంకర్ అనే చెప్పాలి.

ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.వరుస ప్లాపుల్లో ఉన్న సమయంలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాతో హిట్ అందించాడు.

Telugu Harish Shankar, Mythri Makers, Pawan Kalyan, Pawankalyan, Theri, Ustaadbh

ఇక ఇదే కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇక ఇప్పుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఇది రీమేక్ అని టాక్ వస్తూనే ఉంది.

Telugu Harish Shankar, Mythri Makers, Pawan Kalyan, Pawankalyan, Theri, Ustaadbh

తేరి సినిమాకు రీమేక్ అని వార్తలు వచ్చాయి.మరి దీనిపై ఇప్పుడు అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది.ఈ సినిమా గురించి డైరెక్టర్ దశరధ్ మాట్లాడుతూ.

ఈ సినిమాకు తాను స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నానని.తమిళ్ మూవీ తేరికి ఇది రీమేక్ అని ఇందులో మెయిన్ పాయింట్ తీసుకుని తెలుగు ఆడియెన్స్ కు ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించానికి సిద్ధం అవుతున్నాం అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube