10 రోజుల ముందే హౌస్ ఫుల్స్.. ఫ్లాప్ 'గుడుంబా శంకర్' తో పవన్ కళ్యాణ్ వండర్స్!

ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ మన టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అభిమానులు తమ అభిమాన హీరోల కొత్త సినిమాలకంటే కూడా రీ రిలీజ్ సినిమాలకే( Rerelease Movies ) ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఎందుకంటే ఇప్పుడు ఉన్న అభిమానులు తమ అభిమాన హీరో వింటేజ్ సినిమాలను అప్పట్లో థియేటర్స్ లో మిస్ అయ్యుంటారు కదా, అందుకే ఈ రీ రిలీజ్ సినిమాలకు అంత క్రేజ్.అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో అత్యధిక రికార్డ్స్ ఉన్నవి కేవలం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాలకు మాత్రమే.

గత ఏడాది మహేష్ బాబు పోకిరి ( Pokiri ) సినిమాతో ప్రారంభమైన ఈ ట్రెండ్ జల్సా తో( Jalsa Movie ) తారాస్థాయికి చేరుకుంది.ఆ తర్వాత ఖుషి చిత్రం కూడా రీ రిలీజ్ లో మొదటి రోజు నుండి క్లోసింగ్ వరకు ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది.

ఈ సినిమా ఫుల్ రన్ రికార్డ్స్ ని ఇప్పటి వరకు ఏ హీరో కూడా బ్రేక్ చెయ్యలేదు కానీ, మొదటి రోజు కలెక్షన్స్ ని మాత్రం రీసెంట్ గా మహేష్ బాబు బిజినెస్ మేన్( Business Man Movie ) రీ రిలీజ్ దాటేసింది.ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇదే ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డు.

Advertisement

ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుడుంబా శంకర్( Gudumba Shankar Movie ) చిత్రం తో బ్రేక్ చెయ్యబోతున్నాడు.సెప్టెంబర్ 2 వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా గుడుంబా శంకర్ ని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలలో ప్రారంభించారు.ముందుగా హైదరాబాద్ లో బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, నాలుగు షోస్ టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్స్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాగా పిలవబడే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే పది రోజుల ముందే హౌస్ ఫుల్స్ పడడం విచిత్రం.ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా మహిమే అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.కొత్త సినిమాలు విడుదల అవుతుండడం వల్ల ఈ చిత్రానికి థియేటర్స్ దక్కుతాయో లేదో అనే భయం ఫ్యాన్స్ లో ఉంది.

కానీ భారీ రిలీజ్ కి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు