పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా( Hari Hara Veeramallu )ను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను అంతా వ్యక్తం చేస్తున్నారు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా మేకింగ్ విషయంలో ఆలస్యం అవుతోంది.షూటింగ్ ఆలస్యం కారణంగా ఇప్పటికే విడుదల అవ్వాల్సిన సినిమా కాస్త ఆలస్యం అవుతోంది.
ఇక అన్ని విధాలుగా క్రిష్ నిరుత్సాహ పరుచుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.వినాయక చవితి సందర్భంగా సినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియో ని విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.
ఇక వీరమల్లు సినిమా విషయం పక్కన పెడితే ఓజీ సినిమా( OG Movie ) ప్రమోషన్ విషయం లో కూడా సాహో సుజీత్ నిరాశ పరిచాడు.పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఓజీ సినిమా వీడియో విడుదల అవ్వడం లేదని అభిమానులు ఫీల్ అయ్యారు.మొత్తానికి సినిమా ప్రమోషన్ పై సాహో సుజీత్ కి కూడా ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఓజీ కూడా వినాయక చవితి పండుగ కి స్పెషల్ గా ఏమీ తీసుకు రాకపోవడం తో అసహనం వ్యక్తం అవుతోంది.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లో భవదీయుడు భగత్ సింగ్( Bhavadeeyudu Bhagat Singh ) అనే సినిమా కూడా రూపొందుతోంది.ఆ సినిమా షూటింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు.కనీసం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ అయినా వస్తే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న ఏ ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా వినాయక చవితికి సర్ ప్రైజ్ ఇవ్వక పోవడం తో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.