విలక్షణ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రీమేక్ మూవీ వినోదయ సీతం (Vinodhaya Sitham).రీమేక్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు.అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే నుండే షూట్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.
పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి ఈ సినిమాను త్రివిక్రమ్ నిర్మిస్తున్నాడు.ఇక థమన్(Thaman) ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుగుతుండగా.అప్పుడే పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తి అయ్యింది అని సమాచారం.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 22 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించాడు.మరి అప్పుడే ఈ సినిమా షూట్ ఆయన పార్ట్ పూర్తి అయినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా షూట్ సముద్రఖని శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ కు సముద్రఖని (Samudrakhani)ఒక సీన్ విషయమై సూచనలు ఇస్తున్న పిక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరగగా. జులై 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలను లైన్లో పెట్టాడు.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”హరిహర వీరమల్లు”(Harihara Veeramallu) సినిమాను మధ్యలోనే ఆపేసిన పవన్ ముందుగా హరీష్ శంకర్ (Harish Shankar) తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడట.

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh)సినిమాను ప్రకటించిన విషయం విదితమే.ఈ సినిమా వచ్చే నెలలో షూట్ స్టార్ట్ అవ్వబోతుంది అని టాక్.ఇక ఈ సినిమాతో పాటు సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.







