ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి( M.M Keeravani ) పేరు కూడా ఒకటి.కీరవాణి ఇటీవలె ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు పాటకు సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రస్తుతం ఆ సక్సెస్ను ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కీరవాణి.ఈ సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరవాణి మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ( Ramgopal Verma ) గురించి రామ్ గోపాల్ వర్మతో పని చేయడం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి మాట్లాడుతూ.నేను ఎంతమంది దర్శక నిర్మాతలకు ట్యూన్స్ వినిపించాను.అందులో కొందరికి మాత్రమే నా పాటలు నచ్చాయి మరికొందరికి నా పాటలు నచ్చలేదు.ఈరోజు నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది కానీ శివ సినిమా( Siva movie ) లాంటి సెన్సేషనల్ చేసిన సినిమా రాంగోపాల్ వర్మతో కలిసి పనిచేసే అవకాశం రావడమే నాకు మొదటి ఆస్కార్ అవార్డు వచ్చినట్లు అని తెలిపారు కీరవాణి.
క్షణం క్షణం సినిమాకు నేను మ్యూజిక్ ని అందించాను.ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మ నన్ను సైన్ చేసిన తర్వాతే ప్రపంచం నన్ను గుర్తించింది అని చెప్పుకొచ్చారు కీరవాణి.
క్షణం సినిమా విడుదల అయిన తర్వాత నాకు అవకాశాలు క్యూ కట్టాయి.

అందుకే రామ్ గోపాల్ వర్మతో కలిసి పని చేయడం నా మొదటి ఆస్కార్ అవార్డుగా నేను భావిస్తాను అని తెలిపారు కీరవాణి.అలాగే రాంగోపాల్ వర్మ తాను మంచి స్నేహితులమని, కానీ కొన్ని కష్టాలు విభేదాలు అలాగే బిజీ బిజీ షెడ్యూల్ వల్ల ఇద్దరికి కలవడం కుదరలేదు అని తెలిపారు.ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన రామ్ గోపాల్ వర్మ.
కీరవాణి నాకు నేను మరణించినట్లు అనిపిస్తుంది.చనిపోయిన వారిని అలాగే పొగుడుతారు అంటూ ఫన్నీగా స్పందించాడు రామ్ గోపాల్ వర్మ.
ఆ ట్వీట్ పై స్పందించిన కొందరు నెటిజెన్స్ కీరవాణి అంత గొప్పగా చెబితే మీరు అలా కామెంట్ చేశారు ఏంటి ఆర్జీవి అంటూ మండి పడుతున్నారు.







