మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించిన పవన్ మూవీ.. ఆంధ్రాలో పరిస్థితి అలా ఉందంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైనా కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించింది.

మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, 69 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించినట్టు సమాచారం.ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా నైజాంలో ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

కర్ణాటక, ఇతర ఏరియాల్లో కూడా ఈ సినిమా పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఏపీలో కూడా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ బాగానే ఉన్నా టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటంతో సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతోంది.

భీమ్లా నాయక్ కొన్ని ఏరియాలలో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

Advertisement

భీమ్లా నాయక్ కలెక్షన్ల విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.భీమ్లా నాయక్ సెకండ్ వీకెండ్ నాటికి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.అయితే ఏపీలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రేపు శివరాత్రి పండుగ కావడంతో భీమ్లానాయక్ కు కలిసొస్తుందని చెప్పవచ్చు.

ఈ సినిమా 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఫుల్ రన్ లో భీమ్లా నాయక్ బాక్సఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.మరోవైపు పవన్ కళ్యాణ్ సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

తెరి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు