కరోనా మహమ్మారి ఏపీలో రోజు రోజుకి విస్తరిస్తుంది.దీనిని నియంత్రించడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ప్రజల నిర్లక్ష్యం తోడు కావడంతో కేసుల సంఖ్య పెరిగిపోతుంది.
అయితే ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కరోనాని కట్టడి చేయడంలో, అలాగే ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన విషయంలో జగన్ చెబుతున్న మాటలు ప్రతిపక్షాల విమర్శలకి కారణం అవుతున్నాయి.
మొదటి నుంచి కరోనా అంత ప్రమాదకరమైన రోగం కాదని, ఇది కేవలం ఒక జ్వరంలాంటిదే అని కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటూ జగన్ చెబుతూ వచ్చారు.అయితే ఈ విషయంపై ప్రజలని అప్రమత్తం చేసి కరోనా తీవ్రతని ప్రజలని తెలియజేసి జాగ్రత్తగా ఉండమని చెప్పే ప్రయత్నం చేయలేదు.
తాజాగా మరోసారి కూడా ఇలాంటి వాఖ్యలే చేశారు.
కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుంది.
ఇది భయంకరమైన రోగం కాదు అని మీడియా సమావేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు.భవిష్యత్తులో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని, కాస్తా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.
దీనిపై ఇప్పటికే విపక్షాలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి.అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనం అనుకుంటున్నట్టు కొవిడ్-19 సాధారణ జ్వరం కాదు.కొవిడ్-19 వైరస్ కారణంగా రోగుల ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని చైనాలో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.కావాలంటే సైన్స్ న్యూస్ లో వచ్చిన ఈ కథనం చదువుకోండి అంటూ సదరు లింకును కూడా పవన్ ట్వీట్ చేశారు.జగన్ అన్న మాటలపైనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యి ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ ఏవైనా విమర్శలు చేస్తే వ్యక్తిగతంగా దాడి చేసే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు పవన్ ట్వీట్ పై ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.