Janasena Polavaram Candidate : స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్ పోలవరం అభ్యర్థి ఖరారు..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పీడ్ పెంచారు.2024 ఎన్నికలలో జనసేన పార్టీ( Janasena Party ) 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో శనివారం రెండు స్థానాలకు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.

ఈ గన్నవరం స్థానానికి గడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు.అనంతరం ఏలూరు జిల్లాలోని పోలవరం( Polavaram ) స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు.పోలవరంలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన చిర్రి బాలరాజును( Chirri Balaraju ) పోటీకి దింపడం జరిగింది.

ఈ  మేరకు బాలరాజు అభ్యర్థత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా మూడు పార్టీలను కలుపుకొని పనిచేస్తానని.పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు.2019లో పోలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు.ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోరగం శ్రీనివాస్ మీద గెలవడం జరిగింది.2014లో బోరగం శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుండి విజయం సాధించారు.2019 ఎన్నికలలో రెండో స్థానంలో నిడిచారు.దీంతో 2024 ఎన్నికలలో టికెట్ ఆశించడం జరిగింది.

కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు.ఈ క్రమంలో జనసేన తరఫున చిర్రి బాలరాజు అభ్యర్థిత్వాన్ని.పవన్ ఖరారు చేయడం జరిగింది.

Advertisement
కేటీఆర్ కు అంత శక్తి ఉందా ? జగ్గారెడ్డి కౌంటర్ 

తాజా వార్తలు