ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ గొప్పతనం మాదే అంటూ హీరోలు లేదా మిగతా వ్యక్తులు ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు.కానీ సినిమా పరాజయం పాలైతే మాత్రం చాలాసార్లు దానికి సంబంధించిన ప్రభావం ఆ డైరెక్టర్ పైనే పడుతుంది.
అయితే ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది అంటే కనీసం డైరెక్టర్ కూడా సరిగ్గా డైరెక్షన్ చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.హీరో ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తోంది లేదా నిర్మాత డిమాండ్ ఎక్కువ అయిపోతుంది.
ఇలా కొన్ని కారణాల వల్ల సినిమా సరైన అవుట్ పుట్ అందుకోలేకపోతోంది.అయితే ఎవరి తప్పు ఉన్నా కూడా డైరెక్టర్ ఒక సినిమా పరాజయం తన భుజాలపై వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
అలా తన తప్పును లేదా పక్కవారి తప్పు తన మీద వేసుకొని సినిమా పరాజయాన్ని పూర్తిగా బాధ్యత వహించిన ఆ దర్శకులు ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
![Telugu Directors, Leo, Lokeshkanakaraj, Failure, Rajamouli, Yamadonga-Movie Telugu Directors, Leo, Lokeshkanakaraj, Failure, Rajamouli, Yamadonga-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/directors-who-are-accepted-their-failure-rajamouli-lokesh-kanakaraj-detailss.jpg)
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) పేరు బాగా వినిపిస్తుంది.తమిళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ వస్తున్నాడు ఈ డైరెక్టర్.అయితే లియో సినిమా( Leo Movie ) పరాజయం పూర్తిగా తనపైన వేసుకుని ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు.
సదరు చిత్రం సెకండ్ హాఫ్ బాగో లేకపోవడం వల్ల ఈ సినిమా సక్సెస్ సాధించలేదు అంటూ తన తప్పును ఒప్పుకొని ఆ బాధ్యత పూర్తిగా తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం.ఇక ఇదే తరహాలో రాజమౌళి( Rajamouli ) కూడా తనదైన రీతిలో ఒక పరాజయాన్ని ఒప్పుకున్నాడు.
యమదొంగ సినిమా( Yamadonga Movie ) టైంలో ఎవరు ఊహించని విధంగా రాజమౌళి తన అసహనాన్ని బయట పెట్టాడట.సినిమా నిజానికి సక్సెస్ అందుకుంది కానీ టెక్నికల్ గా డైరెక్టర్ మాత్రం ఇంకా కొంచెం బాగా చేసి ఉండాలి అనే మాట వినిపించింది.
ఈ విషయాన్ని రాజమౌళి కూడా ఒప్పుకోవడం విశేషం.
![Telugu Directors, Leo, Lokeshkanakaraj, Failure, Rajamouli, Yamadonga-Movie Telugu Directors, Leo, Lokeshkanakaraj, Failure, Rajamouli, Yamadonga-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/directors-who-are-accepted-their-failure-rajamouli-lokesh-kanakaraj-detailsd.jpg)
నిజానికి ఈ సినిమాలో అన్ని సినిమాలతో పోలిస్తే రాజమౌళి ఎలాంటి ఎమోషన్స్, ఎలివేషన్స్ ఇవ్వలేదు.కానీ కంటెంట్ బాగా ఉండడంతో సినిమా మంచి సక్సెస్ అయితే సాధించింది కానీ కొంతమంది ఎదురు చూసిన సీన్స్ లేకపోవడంతో వారిని నిరాశ పరిచింది.ఈ విషయాన్ని రాజమౌళి ఎన్నో సార్లు మీడియా ఇంటర్వ్యూస్ లో తెలియజేస్తూనే వస్తున్నాడు.
సినిమా చూసి నిరాశ పడిన ఆ కొద్దిమంది కి తానే బాధ్యుడిని అని, అలా జరగకపోయి ఉంటే బాగుండేదని ఆయన చెబుతూ వస్తున్నాడు.