పవన్ కళ్యాణ్, బాబు మధ్య బంధం మళ్ళీ చిగురిస్తుందా! రాజగురువు సాక్షిగా ఒకటిగా  

బాబుతో మాటలు కలిపిన పవన్ కళ్యాణ్.

Pawan Kalyan And Chandrabaubu Meet In Ramojirao Grand Daughter Marriage Reception-marriage Reception,pawan Kalyan,ramojirao Grand Daughter

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే. గత ఎన్నికలలో టీడీపీకి సపోర్ట్ చేసి తరువాత బయటకి వచ్చి అధికార పార్టీ టీడీపీ మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ మీద దారుణ వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ని టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శించారు. అలాగే పరోక్షంగా మీడియా ద్వారా అతని వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేసారు...

పవన్ కళ్యాణ్, బాబు మధ్య బంధం మళ్ళీ చిగురిస్తుందా! రాజగురువు సాక్షిగా ఒకటిగా-Pawan Kalyan And Chandrabaubu Meet In RamojiRao Grand Daughter Marriage Reception

దీంతో ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరిపోయింది. ఇక ఎన్నికల ముందు వైసీపీ, టీడీపీ మీద విమర్శలతో దాడి చేసిన పవన్ కళ్యాణ్ ఇక బాబుతో కలిసే అవకాశాలు లేవని అందరూ భావించారు.అయితే అప్పుడప్పుడు రాజకీయాలలో కొన్ని సంఘటనలు నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

ఇప్పుడు ఎన్నికల్లో ఒకరిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎన్నికల అనంతరం కలుసుకోవడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజగురువు రామోజీ రావు మనవరాలి వివాహ రిసెప్షన్ లో ఇద్దరు కలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని సరదాగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి కలయికని మీడియా ఫోటోలతో బంధించి వెంటనే బయటకి వదిలింది.

దీంతో ఎన్నికల తర్వాత వీరి కలయిక మరోసారి రాజకీయాలలో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారింది.