Mudragada Padmanabham : పవన్ సినిమాల్లో హీరో..నేను రాజకీయాల్లో హీరోని..: ముద్రగడ

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరానని తెలిపారు.

 Mudragada Padmanabham : పవన్ సినిమాల్లో హీరో-TeluguStop.com

వైఎస్ జగన్ ను( YS Jagan ) మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే తాను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

కొందరు కావాలనే కుట్రపూరితంగా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.తాను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదని తెలిపారు.

ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిచారన్నారు.

కాపు ఉద్యమంలో ఎక్కువమంది దళితులే ఉన్నారన్న ముద్రగడ తనకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రత్తిపాడు ప్రజలేనన్నారు.తనకు కులం ముఖ్యం కాదన్న ఆయన వర్గం ముఖ్యమని స్పష్టం చేశారు.చంద్రబాబు( Chandrababu ) పాలనలో ఐదేళ్లు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఎక్కడున్నారని ప్రశ్నించారు.

కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.పవన్ సినిమాల్లో హీరో కావచ్చు కానీ తాను రాజకీయాల్లో హీరోనని వెల్లడించారు.

ఈ క్రమంలోనే జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube