ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita )ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు.
ఇందులో భాగంగా ఈడీ తరపున న్యాయవాదులు ఏఎస్జీ ఎస్వీ రాజు, ఎన్కే మట్టా, జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కవితను ఈడీ( ED ) పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారని తెలుస్తోంది.అటు కవిత తరపున లాయర్ మోహిత్ రావు వాదనలు వినిపిస్తున్నారు.మరోవైపు తన అరెస్ట్ చట్ట విరుద్ధమని కవిత పేర్కొన్నారు.
దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఆమె వెల్లడించారు.







