జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో పవన్ కే తెలియదు..: సజ్జల

ఏపీలోని టీడీపీ, జనసేనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ - జనసేన పొత్తు వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో పవన్ కల్యాణ్ కే తెలియదని సజ్జల విమర్శించారు.సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

జనసేన వేరే పార్టీలా ఉండటం ఎందుకున్న సజ్జల టీడీపీలో కలపొచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు.రెండు పార్టీలకు సృష్టత లేదని ఆరోపించారు.175 స్థానాల్లో పోటీకి రెండు పార్టీలకు అభ్యర్థులు లేరని విమర్శించారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ అర్జంట్ గా అధికారంలోకి రావాలనుకుంటున్నారన్నారు.

రెండు గంటల పాటు బ్రతిమాలుకుని పవన్ ను లోకేశ్ యువగళం ముగింపు సభకు తీసుకెళ్లారని చెప్పారు.ఈ క్రమంలోనే 2019లో టీడీపీతో పవన్ కు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు.

Advertisement

ఇద్దరికీ కమ్యునికేషన్ గ్యాపా లేక ఏదైనా ఒప్పందంలో గ్యాపా అని డిమాండ్ చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు