తెలంగాణలో పవన్ ప్రచారం: బీఆర్ఎస్ ను ఎండగడతారా?

చాలాకాలంగా సస్పెన్స్ లో ఉంచిన జనసేనా ని ఎంట్రీ తెలంగాణలో ఖరారు అయింది.

ఈ రోజు నుండి ఆయన జనసేన అభ్యర్థులు ఫోటి లో ఉన్న స్తానాలతో పాటు కూటమిలోని భాజపా అభ్యర్థులలో కొంతమందికి కూడా ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఆ లిస్టులో వరంగల్ నుంచి పద్మారావు( Padma Rao ) తరపున తాండూరు నుంచి శంకర్ గౌడ్,( Shankar Goud ) కూకట్పల్లి నుంచి ప్రేమ్ కుమార్ నియోజకవర్గాలలో ఆయన పర్యటనలు ప్రస్తుతానికి ఖరారు అయ్యాయి .తద్వారా తెలంగాణ ఎన్నికలలో పవన్( Pawan Kalyan ) ప్రచారం చేస్తారని స్పష్టత వచ్చినట్లు అయింది .అంతేకాకుండా బజాపా అగ్రనేతల బహిరంగ సభలలో కూడా పవన్ వేదిక పంచుకుంటారని జనసేన వర్గాలు అంటున్నాయి.

అయితే పవన్ తన ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఏ అంశాలను తీసుకుంటారనేది ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారింది.ముఖ్యంగా భారతీయ రాష్ట్ర సమితి( BRS ) నేతలతో కూడా పవన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.కేటీఆర్ తో( KTR ) సోదర భావం పవన్ కలిగి ఉన్నారు.

మరి అలాంటప్పుడు బారాసాను భారీ ఎత్తున విమర్శిస్తే దానికి తగ్గ మూల్యం కూడా పవన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది.అంతేకాకుండా పవన్ డిమాండ్ లకు బజాపా( BJP ) కూడా పూర్తిస్థాయిలో అనుకూలంగా లేనందున ఇప్పుడు పవన్ బజాపా తరఫున వకాల్తా తీసుకొని అధికార పార్టీపై చెలరేగిపోతే మాత్రం మరిన్ని కొత్త సమస్యలు జనసేన( Janasena ) ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు

Advertisement

ఇలా కాకుండా వయామీడియాగా బాజాపా వస్తే తెలంగాణ బాగుపడుతుంది అన్న కోణంలో ప్రచారం చేస్తే మాత్రం పరవాలేదు కానీ పరిపాలనలో బారాస వైఫల్యం చెందిందన్న కోణంలో విమర్శలు చేస్తే మాత్రం దానికి తగిన రీతిలోనే బారాసాన్నించి కౌంటర్ లు వచ్చే అవకాశం ఉంది.అంతే కాక రేపు తెలంగాణలో మరోసారి బిఆర్ఎస్ అధికారంలో వస్తే మాత్రం జనసేన రాజకీయ వ్యవహారాలకు కూడా కొంత ఇబ్బంది కలిగించే కోణంలో బారాస పావులు తిప్పే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి .మరి పవన్ అంటీ ముట్టనట్టుగా ఉంటారా? లేక బారాసకు ఎదురు వెళ్తారో చూడాలి.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు