స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమాలలో పౌర్ణమి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
త్రిష, ఛార్మి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన ఎం.ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించారు.అయితే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకుడికి నచ్చితేనే సినిమా హిట్ అవుతుందని అందరూ కథ విని చేసినా కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అవుతాయని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.కర్తవ్యం సినిమాలో చేసిన కొన్ని మార్పుల వల్లే ఆ సినిమా సక్సెస్ సాధించిందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
నరసింహనాయుడు సినిమా సెకండాఫ్ లో చాలా సీన్లు కట్ చేశామని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.ఎడిటింగ్ టేబుల్ దగ్గర సీన్లను కట్ చేస్తేనే సినిమా సక్సెస్ అవుతుందని గోపాలకృష్ణ అన్నారు.

స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గోపాలకృష్ణ వెల్లడించారు.పాత్రలకు తగిన నటీనటులు నటిస్తే మాత్రమే సినిమాలు సక్సెస్ సాధిస్తాయని గోపాలకృష్ణ వెల్లడించారు.పౌర్ణమి సినిమా రిలీజ్ ఆపాలని తప్పులు ఉన్నాయని విలన్ ను కొట్టే ఫైట్ క్లైమాక్స్ లో ఉంటే బాగుంటుందని అన్నామని గోపాలకృష్ణ అన్నారు.ఆ సినిమా మేము కోరుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదని గోపాలకృష్ణ తెలిపారు.
గోపాలకృష్ణ చెప్పిన విధంగా పౌర్ణమిలో మార్పులు చేసి ఉంటే ఈ సినిమా సక్సెస్ సాధించి ఉండేదేమో అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పౌర్ణమి సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.
అయితే నటుడిగా పౌర్ణమి మూవీ ప్రభాస్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది.