అయ్యా పెద్ద సారు జర ఇలాంటి వాళ్ల భరతం పట్టండి.. ?

కరోనా వచ్చుడు ఏందో గానీ పిల్లల చదువులు మొత్తం సంకనాకి పోయాయని తెలుస్తుంది.ఇక వేసవి సెలవులు కూడా వస్తున్నాయి.

అసలు పిల్లల చదువుల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన నిర్ణయం తీసుకోలేదనే అపవాదు ఉందట.ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందా గురించి తెలుసుకుంటే, పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు హార్టెటాక్ వస్తుందట.

మూడు నెలలే ఫిజికల్ క్లాసులు నడుస్తయి.కానీ ఏడాది మొత్తానికీ కలిపి ఫీజులు కట్టాలనే బలవంతపు వసూళ్లకు శ్రీకారం మొదలైందట.

అదీగాక బంద్ ఉన్న హాస్టళ్లుకు కూడా ఏడాది మొత్తానికీ కలిపి పైసలు కట్టాల్సిందేనట.అసలే కరోనా వల్ల చిల్లుపడిన జేబులను చూస్తూ బ్రతుకీడుస్తున్న మనుషులకు, పిల్లల చదువులు కొరకరాని కొయ్యలా మారిపోయాయని కొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

Advertisement

కొందరి కాలేజీల వాళ్లు అయితే ఫోన్లు చేస్తు మరీ పేరెంట్స్ పై ప్రెజర్ పెడుతున్నారట.కాలేజీ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఇంటర్ బోర్డు అధికారులకు కంప్లయింట్ చేసినా పట్టించుకుంటలేరని పేరెంట్స్ వాపోతున్నారు.

అయ్యా పెద్ద సార్లు కరోనా వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసు.ఇలాంటి సమయంలో చెప్పని చదువులకు కూడా ఫీజులు కట్టమని చెప్పడం న్యాయమా మీరే చెప్పండి.

ఇలా దోచుకునే వారి భరతం పట్టండి.లేదంటే ఈ అవినీతి వసూళ్లలో మీ పాత్ర కూడా ఉందని అనుకుంటారు జనం అని కొందరు విన్నవించుకుంటున్నారట.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు