పిల్లలకి బైక్ ఇస్తే మీరు జైలుకే !

లైసెన్స్ లేకుండా బైకు, కారు నడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉండడం గమనార్హం.

నాలుగైదు రోజుల నుంచీ చూసుకుంటే దాదాపు 45 మంది చంచల్ గుడా జైలు లో కనిపిస్తున్నారు.

వీరికోసం ప్రత్యేక బ్యారక్ ని పెట్టి మరీ జైల్లో పెడుతున్నారు పోలీసులు.ఇతర నేరస్తులతో కలపకుండా ప్రత్యేక దుస్తులనీ, బ్యారక్ నీ సిద్దం చేసి అందులో వీరిని పెడుతున్నారు.

తమ వాహనం కాకుండా వేరే వారి వాహనం తోలుతున్నవారినైతే ఏకంగా ఓనర్ ని కూడా పిలిపించి అతన్ని కూడా కోర్టులో హాజరు పరుస్తున్నారు.ఇప్పుడు పిల్లల కి వాహనాలు ఇచ్చే తల్లితండ్రుల మీద సీరియస్ గా ప్రవర్తించాలి అని కోరుతున్నారు పోలీసులు, మూడు సార్ల కంటే ఎవరయినా 18 ఏళ్ళ వయసు లోబడినవారు లైసెన్స్ లేకుండా దొరికితే న్యాయస్థానం ముందు హాజరు పరచడమే కాకుండా వారి తల్లి తండ్రులని కూడా పిలిపించి 15 రోజులు జైలు శిక్ష వేసేస్తున్నారు.

వారికి భవిష్యత్తు లో పాస్ పోర్ట్ లు రావు అనీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దొరకవ్ అనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు