ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోలు గ్రేట్ భయ్యా... కమిట్మెంట్ అంటే వీరిదే ?

ప్రభాస్, యశ్ ఇద్దరూ పాన్ ఇండియా హీరోలే.ఒకరు కన్నడ ఆణిముత్యం అయితే మరొకరు టాలీవుడ్ నిధి.

ఇరువురు కూడా తమ తమ చిత్రాలతో సత్తా చాటిన వారే.వీరిద్దరిలో కీలకమైన కామన్ పాయింట్ ఏమిటంటే.!! ఇరువురు కూడా వర్క్ అంటే ప్రాణం పెడతారు.

ఓ సారి కమిట్మెంట్ ఇచ్చాక ఎంత కష్టమైనా, నష్టమైనా ఆనందంగా భరించి ముందుకు వెళతారే తప్ప, వెనకడుగు వేయరు.రెండు మూడు ప్రాజెక్టు లు ఒకేసారి చేస్తూ హడావిడిగా అక్కడో అడుగు ఇక్కడో అడుగు వేస్తూ ఇన్ కంప్లీట్ భావన ఫీల్ అయ్యేకంటే ఒకే ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టిని కేంద్రీకరించి నిమగ్నతతో ప్రాజెక్ట్ ను పూర్తి చేసి కంప్లీట్ గా ఫీల్ అవడం లోనే అసలైన ఆనందం ఉంది అని నమ్మేవారు.

ఇదే తరహాలో అటు ప్రభాస్ బాహుబలి, అలాగే బాహుబలి సీక్వెల్ చిత్రం కోసం ఆరేళ్లు కేటాయించి ఒకే ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు పనిచేసి , వేరే లోకం అన్నదే లేకుండా ఈ ప్రాజెక్ట్ పైనే తన దృష్టిని కేంద్రీకరించి ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణగా, ప్రేమతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు ప్రభాస్.ఆ ఎఫర్ట్ అంతా మనకు స్క్రీన్ పై కనిపించింది.

Advertisement

దాని ఫలితం ప్రభాస్ కు భారీగానే దక్కింది.బాహుబలి సినిమాలో ప్రతి ఒక్కరూ కూడా అహర్నిశలు కష్టపడి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు.

శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా అందుతుందని పెద్దలు అంటుంటారు.అది నిజమే బాహుబలి, బాహుబలి 2 చిత్రాల రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి దర్శకుడు జక్కన్న, హీరో ప్రభాస్, నటుడు రానా తదితరులు అంతా కూడా ఆరేళ్లు పాటు తమ పడ్డ కష్టాన్ని మరచిపోయారు.

హీరో ప్రభాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఏంటి ఒక స్టార్ హీరో అయ్యుండి ఇన్ని సంవత్సరాలు ఓకే సినిమా కోసం వేస్ట్ చేయడం ఏంటి అన్న వాళ్లు సైతం ఈ సినిమా సక్సెస్ తో సమాధానం చెప్పారు డార్లింగ్.బాహుబలి 1 అండ్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించాయి.

ప్రభాస్ టైం అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని అన్న వారే.ప్రభాస్ చేసింది పర్ఫెక్ట్ అని ప్రశంసలు కురిపించారు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి మూవీ అనంతరం అన్నట్లుగా మారిపోయింది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

భారత దేశ సినీ చరిత్రలో ఒక సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు అయ్యాక కూడా 1000 థియేటర్లకు పైగా అంతే విజయవంతంగా ఆడటం వంటి ఘనతను బాహుబలి చిత్రానికే దక్కింది.ఇందులో ప్రభాస్ పాత్ర కీలకం అని చెప్పాలి.

Advertisement

ఇప్పుడు అదే విధంగా సలార్ సినిమా కోసం మరే ఇతర సినిమాను చేయకుండా, దీని కోసం కష్టపడుతున్నాడు.

ఇక ఇదే తరహాలో సినిమాని దైవంగా భావించే వ్యక్తి యశ్. ఈ హీరో కూడా కే జి ఎఫ్ , కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్రాల కోసం ఏకంగా ఆరేళ్ల సమయం కేటాయించారు.అంతే శ్రద్ధ, నిబద్ధతతో పాత్రను పర్ఫెక్ట్ ప్రజెంట్ చేసి అందరితోనూ మా స్టార్ రాఖీ బాయ్ అని పిలిపించుకుంటున్నారు.

ఇలా ఈ ఇద్దరు హీరోలు ఒకే ప్రాజెక్ట్ కోసం తమ కెరియర్లో తమ పంకి అంత సమయాన్ని కేటాయించడం అంటే అది వారి సిన్సియారిటీ కి అద్దం పడుతుంది.

తాజా వార్తలు