తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.ఈ క్రమంలో టికెట్ రాని చాలామంది నాయకులు అసంతృప్తితో ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు.
ఈ రకంగానే కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి( Palvai Sravanti ) బీఆర్ఎస్ పార్టీలోకి( BRS ) వెళ్తున్నట్లు ప్రచారం సాగింది.కాంగ్రెస్( Congress Party ) రెండో జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో.
పార్టీ మారటానికి స్రవంతి నిర్ణయం తీసుకున్నట్లు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పాల్వాయి స్రవంతి స్పష్టత ఇచ్చారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నా వార్తలలో వాస్తవం లేదని పేర్కొన్నారు.నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను.
కొందరు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు.
దయచేసి ఇలాంటి వార్తలను ఎవరు నమ్మొద్దు.మునుగోడు నియోజకవర్గంలో( Munugode Constituency ) ఉన్న శ్రేయోభిలాషులు కాంగ్రెస్ కార్యకర్తలు.సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను వేరే పార్టీలో జాయిన్ అయినట్లు వచ్చిన వార్తలను దయచేసి నమ్మొద్దు.ఉప ఎన్నికలలో జరిగిన సంఘటననే మళ్లీ పునరావృతం చేస్తూ ఫేక్ న్యూస్ పంపుతున్నారు.
వీటిని ఎవరు నమ్మొద్దు.వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకునే రీతిలో ఆలోచన చేస్తున్నాను.
నేను మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నాను.ఈ క్రమంలో తదుపరి కార్యాచరణ పై నిర్ణయం తీసుకునే క్రమంలో ఇటువంటి వార్తలు రావడం.
తీవ్రంగా ఖండిస్తున్నాను అని పాల్వాయి స్రవంతి స్పష్టత ఇచ్చారు.