ఆర్యన్ ఖాన్ తో డేటింగ్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఆ నటి?

ఆర్యన్ ఖాన్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గతంలో డ్రగ్స్ కేసు విషయంలో భాగంగా షారుఖ్ ఖాన్ తనయుడు అయిన ఆర్యన్ ఖాన్ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలలో మారు మోగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.కొద్దిరోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ ఖాన్ పేరే వినిపించింది.

కొద్దీ రోజులపాటు ఆర్యన్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోగా ఆ తర్వాత కొంతకాలం పాటు ఆర్యన్ పేరు అసలు వినిపించలేదు.ఇటీవల కాలంలో ఆర్యన్ ఖాన్ పేరు మళ్ళీ మారమగుతోంది.

ఈసారి డేటింగ్ రూమర్స్ తో వార్తలు నిలుస్తున్నాడు ఇస్తారుఈ స్టార్ హీరో తనయుడు.పాకిస్తాన్ నటి మోడల్ సాదియా ఖాన్ తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Advertisement

అంతే కాకుండా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదే ఆ విషయంపై పూర్తిగా క్లారిటీ రాకముందే బాలీవుడ్ నటి నోరా ఫతేహి తో ఆర్యన్ ఖాన్ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవ్వడంతో వారిద్దరి మధ్య ఏమైనా నడుస్తుంది అంటూ మళ్ళీ కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఇంతవరకు ఆ వార్తలపై నోరా ఫతేహి కానీ ఆర్యన్ ఖాన్ కానీ స్పందించలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్యన్, సాదియా డేటింగ్ వార్తలపై స్పందించింది నటి సాదియా ఖాన్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆర్యన్ ఖాన్ తో వస్తున్న డేటింగ్ వార్తలపై స్పందిస్తూ.అసలు ఏమీ తెలియకుండానే ఇటువంటి వార్తలు ఎలా సృష్టిస్తారు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది.

కలిసి ఫోటో దిగితే వారు రిలేషన్ షిప్ లో ఉన్నట్లేనా? అసలు విషయాలు తెలియకుండా ఏం జరిగిందో తెలియకుండానే అలా ఎలా రాసేస్తారు.ఒక్క ఫోటో కలిసి దిగినంత మాత్రాన డేటింగ్ లో ఉన్నారని ఎలా అభిప్రాయపడతారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇదంతా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది అంటూ ఆమె ఆ వార్తల పట్ల అసహనం వ్యక్తం చేసింది.అనంతరం ఆర్యన్ ఖాన్ తో కలిసి దిగిన ఫోటో గురించి స్పందిస్తూ.ఆర్యన్ న్యూ ఇయర్ ఈవెంట్ లో కలిసాను.

Advertisement

అప్పుడు మేము మాట్లాడుకున్నాము.ఆ సందర్భంలోనే ఫోటోలు కూడా దిగాము.

ఫోటోలు దిగినంత మాత్రాన మేమిద్దరం డేటింగ్ లో ఉన్నట్లు కాదు.ఆరోజు న్యూ ఇయర్ పార్టీ నేను మాత్రమే లేను చాలామంది ఉన్నారు.

వాళ్ళందరు కూడా ఆర్యన్ ఖాన్ తో కలిసి ఫోటో దిగారు.వారందరూ కూడా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వారి పేర్లు రాకుండా రూమర్స్ నా పైన ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంటూ ఆమె ఆ వార్తలపై మండి పడింది.

తాజా వార్తలు