మళ్ళీ తెగబడిన పాకిస్తాన్

సరిహద్దుల్లో పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు తెగబడింది.కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది.

సరిహద్దుల్లోని 9 ఔట్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతోంది.రాత్రి నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

సాంబా సెక్టార్లో సరిహద్దు భద్రతా దళాలు పాక్ కాల్పులను అడ్డుకుంటున్నాయి.కాల్పులు భారీగా జరుగుతున్నట్లు సమాచారం.

కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.భారత్ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు లేకుండానే పాక్ దళాలు కాల్పులు ప్రారంభించాయి.

Advertisement

పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రవాదులను భారత్లోకి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని కాశ్మీర్ ప్రభుత్వం ఆరోపించింది.పాక్ కాల్పుల కారణంగా భాజపా మిత్ర పక్షమైన శివసేన మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.

పాక్ మీద యుద్ధం చేయాలని శివసేన ఇదివరకే కేంద్రాన్ని డిమాండ్ చేసింది.పాక్ నుంచి ఇండియాలోకి ఎవరూ అడుగు పెట్టడానికి వీలు లేదంటూ ఆందోళన చేస్తున్నది.

ఈ కాల్పులు దానికి మళ్ళీ ఆయుధంగా ఉపయోగపడుతుంది.అది మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు