ప్రారంభమైన పాక్-ఆసీస్ ల మ్యాచ్.... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్  

Pakistan Australia World Cup Match Started-

ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఈ రోజు పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా జట్టు తో తలపడుతుంది.ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ కు మొగ్గుచూపారు.దీనితో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ జట్టు బ్యాటింగ్ చేయనుంది..

Pakistan Australia World Cup Match Started--Pakistan Australia World Cup Match Started-

గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై 14 పరుగుల తేడా తో విజయం సాధించిన పాక్ జట్టు ఆసీస్ పై కూడా అదే ఊపుతో ఆడాలని భావిస్తుంది.మరోపక్క భారత్ చేతిలో ఓటమి భారం తో ఉన్న ఆసీస్ జట్టు ఈ మ్యాచ్ లో పాక్ పై విజయం సాధించి ఓటమి భారాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది.ఇటీవల భారత్-ఆసీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్ జట్టు 36 పరుగుల తేడా తో టీమిండియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

అయితే పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ జట్టులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.గాయపడిన ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ స్థానంలో షాన్ మార్ష్ ను జట్టులోకి తీసుకోగా, ఆడమ్ జంపా స్థానంలో కేన్ రిచర్డ్ సన్ జట్టులోకి వచ్చినట్లు తెలుస్తుంది.అలానే పాక్ కూడా షాదాబ్ ఖాన్ కి బదులు షహీన్ ఆఫ్రీదీని తుది జట్టులోకి ఎంపిక చేసింది.

ప్రపంచ కప్ టోర్నీ లో భాగంగా ఆదివారం పాక్ జట్టు టీమిండియా తో తలపడనున్న సంగతి తెలిసిందే.అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.