అనకాపల్లి ummalada గ్రామం లో సంక్రాంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఎడ్ల బండి పోటీలు..

గ్రామంలో మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయి ఎడ్ల బండి పోటీలు ఘనంగా నిర్వహించారు.

గ్రామానికి చెందిన కర్రి మాధవరావు, కర్రీ భాస్కర్ రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్ల బండి పోటీలు ఏర్పాటు చేశారు.

ఈ పోటీలో జిల్లా నలుమూలల నుండి సుమారు 30 వరకు ఎడ్లబండ్లు పాల్గొన్నాయి.ఎడ్లబండి పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసారు.

ఈ సందర్భంగా కర్రీ మాధవరావు మాట్లాడుతూ ummalada గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ పోటీల్లో ప్రథమ బహుమతిగా 12000,రెండో బహుమతి గా 10000 మూడో బహుమతి గా 8000 నాలుగో బహుమతి గా 6000ఇస్తున్నామని.

అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఎడ్లబండి 2000 ప్రత్యేక బహుమతిగా ఇస్తున్నట్టు తెలిపారు.మన తెలుగు సాంప్రదాయాలను ఆచరిస్తూ సంక్రాంతి పండుగను అందరు జరుపుకోవాలని అందులో భాగంగానే తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తున్న ఎడ్లబండి పోటీలను ఇక్కడ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు