బీఆర్ఎస్ పై విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంశమే ఉదాహరణ అని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం అభ్యర్థులు అందరూ సహనంతో ప్రచారం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలని చెప్పారు.
ఇప్పటివరకు 51 బీఫామ్ లు మాత్రమే రెడీ అయ్యాయన్న కేసీఆర్ మిగతా బీ ఫామ్ లు సిద్ధం అవుతున్నాయని తెలిపారు.బీ ఫామ్ లు నింపేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
టికెట్లు దక్కని వాళ్లు తొందరపడొద్దన్న కేసీఆర్ మున్ముందు గొప్పగొప్ప అవకాశాలు వస్తాయని వెల్లడించారు.







