మళ్లీ హరీష్ కు తిప్పలు తప్పవా ? కేటీఆర్ కు రిస్క్ లేనట్టేనా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు.ముఖ్యంగా తన కుమారుడు కేటీఆర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

రానున్న రోజుల్లో కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ,  ఆ మేరకు రాజకీయం నడిపిస్తూ ఉంటారు.టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్న చోట మాత్రమే కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తూ,మిగతా చోట్ల వేరే వారికి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు.

దీనిద్వారా కేటీఆర్ ఎక్కడ బాధ్యతలు తీసుకున్నా, అక్కడ గెలుపు ఖచ్చితంగా ఉంటుందని సంకేతాలను ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు తెలంగాణ లో హాట్ టాపిక్ వ్యవహారంగా ఏదైనా ఉందంటే అది ఈటెల రాజేందర్ వ్యవహారమే.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన టిఆర్ఎస్ కు రాజీనామా చేయడం,  బిజెపిలో చేరడం అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వంటివి జరిగిపోయాయి.ఇక అదే పనిగా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్న ఈటెల  బాధ్యత ను మంత్రి హరీష్ రావు కు అప్పగించారట.

Advertisement

ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే దానిని స్పీకర్ ఆమోదించడంతో,  ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.అయితే ఇక్కడ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే విషయం పై టిఆర్ఎస్ లో ఉత్కంఠ నెలకొంది.

హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ కు గట్టి పట్టు ఉండడంతో ఇక్కడ ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విశ్లేషణలు వస్తున్నాయి.మొదటి నుంచి హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో,  అక్కడ ఆయన బలమైన పునాదులు వేసుకున్నారు.

అలాగే సొంత అనుచరగణం ఎక్కువగా ఉండడం , బిజెపి బలం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు.అయినా రాజేందర్ గెలుపు సంకేతాలు వెలువడుతున్నాయి.

అసలు ముందుగా కేటీఆర్ కి హుజురాబాద్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలనే ఆలోచనలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నా, ఇక్కడ కనుక గెలుపు దక్కకపోతే ఆ ప్రభావం కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడి బాధ్యతన మంత్రి హరీష్ రావుకు అప్పగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.రాజేందర్ ను బర్తరఫ్ చేసి అవమానకర రీతిలో బయటకు పంపడంతో సెంటిమెంట్ ఎక్కువగా ఉందని నిఘా వర్గాల రిపోర్టులు కేసీఆర్ కు అందడం తోనే హరీష్ వైపు కెసిఆర్ ముగ్గు చూపించడానికి కారణమట.అయితే ఇక్కడ గెలిస్తే టిఆర్ఎస్ ఖాతాలోకి, ఓడితే హరీష్ రావు ఖాతాలో వేయాలి అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

  గతం లో దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతలను హరీష్ రావు కు అప్పగించిన కేసీఆర్ కు ఓటమి ఎదురవుతుందనే విషయం ముందుగానే తెలుసునని , అందుకే ఆయనకు బాధ్యతలు అప్పగించారని, అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కుతాయని ముందుగా తేలడంతో నే ఆ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి క్రెడిట్ మొత్తం కేటీఆర్ కు దక్కేలా చేశారని,  ఇప్పుడు అదే ఫార్ములాను ఉపయోగించి హరీష్ రావు ను బలి పెట్టబోతున్నారని టిఆర్ఎస్ లోనే చర్చ మొదలైంది.

Advertisement

తాజా వార్తలు