అవును, మీరు విన్నది నిజమే.పేటీఎం ఇపుడు మీకోసం అదిరే ఆఫర్ ఒకదానిని అందుబాటులో ఉంచింది.
మీరు ఎప్పటినుండో కొనాలని కలలు కంటున్న ఫోన్లను ఉచితంగానే పొందేందుకు ఓ అవకాశాన్ని కల్పిస్తోంది.ఇందులో భాగంగా ఐఫోన్ 14, వన్‌ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్ గెలుచుకునే అవకాశం ఇస్తోంది.
కాగా ఈ ఆఫర్ పరమిత కాలం వరకే ఉంటుంది.మార్చి 15 వరకు మాత్రమే అని కంపెనీ పేర్కొంటోంది.
పేటీఎం చెప్పిన వివరాలు మేరకు “రెఫర్ అండ్ విన్”(Refer and Win) అనే కాంటెస్ట్ ఒకదానిని నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా విజేతలుగా నిలిచిన వారికి ఐఫోన్ 14(iPhone 14), వన్‌ప్లస్ 10టీ(OnePlus 10T), జేబీఎల్ లైవ్ వంటి తరతర వాటిని ఉచితంగా పొందొచ్చు.
దానికోసం మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ యూపీఐ(UPI) ద్వారా మొదటి సారి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే.అప్పుడు ఈ బహుమతులు పొందే వీలుంది.ఈ క్రమంలో మీరు 11 మందికి పైగా పేటీఎంను రెఫర్ చేస్తే.ఐఫోన్ 14 గెలుచుకొనే అవకాశం కలదు.అదే విధంగా 11 మందికి పైగా రెఫర్ చేసిన వారికి కూడా ఐఫోన్ 14 గెలుచుకునే అవకాశం కలదు.అదే 5 నుంచి 10 మందికి రెఫర్ చేస్తే.
వారికి వన్‌ప్లస్ 10 టీ స్మార్ట్‌ఫోన్ గెలుచుకునే అవకాశం వుంది.కాగా ఈ వన్‌ప్లస్ 10 టీ స్మార్ట్‌ఫోన్‌ను ముగ్గురికి అందజేస్తారు.
కానీ ఐఫోన్ అనేది ఒకే ఒక్క విజేతకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి.
కాబట్టి మీ మీ అదృష్టాన్ని ఒక్కసారి ఇక్కడ పరీక్షించుకోవచ్చు.ఇక ఒక్కరి నుంచి నలుగురికి రెఫర్ చేస్తే.వారికి జేబీఎల్ లైవ్ హెడ్ ఫోన్స్ ఉచితంగా లభిస్తాయి.
పది మందికి ఈ అవకాశం కలదు.ఈ బహుమతులు కాకుండా కచ్చితమైన రెఫరల్ క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుందని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంటోంది.
మీరు మీ రెఫరల్ లింక్‌ను మీ స్నేహితులకు షేర్ చేయడమే మీ పని.మీరు షేర్ చేసిన లింక్‌ను మీ ఫ్రెండ్ ఓపెన్ చేసి ఫస్ట్ యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే.అప్పుడు మీకు, మీ ఫ్రెండ్‌కు ఇద్దరికీ క్యాష్ బ్యాక్ వస్తుంది.